ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికాడు దక్షిణాఫ్రికా ప్రముఖ పేసర్ డేల్ స్టెయిన్. అతడి బౌలింగ్‌లో ఆడలేక బ్యాట్స్‌మెన్ ఇబ్బందులకు గురైన సందర్భాలు అనేకం. ప్రస్తుత న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఇలాంటి అనుభవాన్నే ఓ సారి ఎదుర్కొన్నాడు. అయితే స్టెయిన్‌కు వినూత్నంగా వీడ్కోలు చెప్పాడీ క్రికెటర్. సంబంధిత ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అసలేం జరిగింది..?
2013లో న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుంది. స్టెయిన్ సంధించిన బంతిని డిఫెన్స్ చేయబోయిన విలియమ్సన్ దాన్ని తాకలేకపోయాడు. కేన్ నడుము కింద భాగంలోని గార్డ్‌ను తాకింది బాల్. దీంతో అది కొద్దిగా విరిగిపోయింది. ఇప్పుడు ఆ గార్డ్ ఫొటోనే ఇన్‌స్టాలో పంచుకున్నాడు విలియమ్సన్. ఇలా ఆ పేసర్‌కు వీడ్కోలు పలికాడు.
-
'I'm not going to apologise'
— The Cricket Paper (@TheCricketPaper) January 13, 2018 " class="align-text-top noRightClick twitterSection" data="
The time Dale Steyn bowled a nugget into Kane Williamson's nuggets 😵 pic.twitter.com/orXX3I4Tfe
">'I'm not going to apologise'
— The Cricket Paper (@TheCricketPaper) January 13, 2018
The time Dale Steyn bowled a nugget into Kane Williamson's nuggets 😵 pic.twitter.com/orXX3I4Tfe'I'm not going to apologise'
— The Cricket Paper (@TheCricketPaper) January 13, 2018
The time Dale Steyn bowled a nugget into Kane Williamson's nuggets 😵 pic.twitter.com/orXX3I4Tfe
36 ఏళ్ల స్టెయిన్.. 2004లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన సఫారీ బౌలర్‌గా నిలిచాడు. ఇందులో 93 మ్యాచ్‌లాడి 439 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ఈ టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగాడు స్టెయిన్.
ఇదీ చూడండి: తెలుపు జెర్సీకి స్పీడ్‌గన్ స్టెయిన్ విశ్రాంతి