అభిమానులంతా ఆసక్తికరంగా మ్యాచ్ చూస్తున్న సమయంలో ఓ అద్భుతం జరిగింది. అయితే అది మైదానంలో కాదు, ఆకాశంలో! గురుడు, శని గ్రహాలు దగ్గరగా చేరి ప్రకాశవంతంగా కనిపించాయి. ఈ రమణీయమైన దృశ్యం సెడెన్ పార్క్ వేదికగా జరిగిన న్యూజిలాడ్×పాకిస్థాన్ రెండో టీ20లో కనిపించింది. ఛేదనకు దిగిన కివీస్ 10వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తుండగా కెమెరామన్ దీన్ని బంధించాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.
-
Jupiter and Saturn can be seen from Seddon Park, but the stars/planets don't appear to be aligning for Pakistan today.
— 🏏FlashScore Cricket Commentators (@FlashCric) December 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
NZ need 64 from 53 balls with nine wickets in hand.
LIVE COMMENTARY:
👉 https://t.co/omeN2wkNrJ 👈#NZvPAK #PAKvNZ pic.twitter.com/JUl8GpRO1U
">Jupiter and Saturn can be seen from Seddon Park, but the stars/planets don't appear to be aligning for Pakistan today.
— 🏏FlashScore Cricket Commentators (@FlashCric) December 20, 2020
NZ need 64 from 53 balls with nine wickets in hand.
LIVE COMMENTARY:
👉 https://t.co/omeN2wkNrJ 👈#NZvPAK #PAKvNZ pic.twitter.com/JUl8GpRO1UJupiter and Saturn can be seen from Seddon Park, but the stars/planets don't appear to be aligning for Pakistan today.
— 🏏FlashScore Cricket Commentators (@FlashCric) December 20, 2020
NZ need 64 from 53 balls with nine wickets in hand.
LIVE COMMENTARY:
👉 https://t.co/omeN2wkNrJ 👈#NZvPAK #PAKvNZ pic.twitter.com/JUl8GpRO1U
భూమి నుంచి చూస్తే ఏవైనా రెండు గ్రహాలు అతి దగ్గరగా చేరినట్లు కనిపించే దృశ్యాన్ని కంజక్షన్‌గా పిలుస్తారు. ఇలా గురు-శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం 'గ్రేట్ కంజక్షన్' అంటారు. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు నిత్యం కొంత దగ్గరగా వస్తున్నాయి. సోమవారం అతి దగ్గరగా చేరి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. దాదాపు నాలుగు శతబ్దాల తర్వాత ఈ అద్భుతం చోటు చేసుకోనుంది. అంతకుముందు 1623లో ఇలా జరిగింది. మరోవైపు సెడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. అనంతరం కివీస్ 19.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఇదీ చూడండి:హఫీజ్ పోరాటం వృథా.. సిరీస్ కివీస్‌దే