ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌లో ఆ జట్టు బౌలర్ జోఫ్రా ఆర్చర్ తమకు పెద్ద ముప్పని తెలిపాడు పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్. గతేడాది జరిగిన యాషెస్, ప్రపంచకప్‌లలో అద్భుత ప్రదర్శన చేశాడని యూనిస్ వెల్లడించాడు.
"ఆర్చర్ మా జట్టుకు ఎదురుకానున్న పెద్ద ముప్పు. ప్రపంచకప్ ఫైనల్లో జరిగిన సూపర్ ఓవర్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తన బౌలింగ్ శైలి విభిన్నంగా ఉంటుంది".
-యూనిస్ ఖాన్, పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్
అయితే జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలు తమ వద్ద ఉన్నాయని తెలిపాడు యూనిస్ ఖాన్. "ఆర్చర్‌పై జట్టుకు ఉన్న నమ్మకం అతనికి ఒత్తిడిగా మారుతుంది. అతడు వేసే స్వింగ్ బంతులు చాలా ప్రమాదకరమైనవి. అందువల్ల బ్యాక్‌ఫుట్‌తో ఆడమని మా బ్యాట్స్మెన్లకు సలహా ఇస్తా" అని వెల్లడించాడు యూనిస్ ఖాన్.
ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడటానికి పాకిస్థాన్ క్రికెట్ బృందం ఆదివారం బయలుదేరి వెళ్లింది. ఈ ద్వైపాక్షిక సిరీస్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి...