ETV Bharat / sports

సెక్యూరిటీ గార్డ్​తో భారత మహిళా క్రికెటర్ డ్యాన్స్ - team india news

టీ20 ప్రపంచకప్​ ఆడుతున్న భారత మహిళా క్రికెటర్ జెమీమా.. కివీస్​తో​ మ్యాచ్​కు ముందు సెక్యూరిటీ గార్డ్​తో డ్యాన్స్​ చేసింది. ఆ వీడియోను ఐసీసీ ట్వీట్ చేసింది.

సెక్యూరిటీ గార్డ్​తో భారత మహిళా క్రికెటర్ డ్యాన్స్
జెమీమా రోడ్రిగ్జ్​ డ్యాన్స్​
author img

By

Published : Feb 27, 2020, 7:48 PM IST

Updated : Mar 2, 2020, 7:04 PM IST

టీ20 ప్రపంచకప్​లో టీమిండియా మహిళా జట్టు సెమీస్​కు చేరుకుంది. న్యూజిలాండ్​తో ఈరోజు జరిగిన మ్యాచ్​లో 4 పరుగుల తేడాతో గెలిచి, హాట్రిక్ విజయాల్ని నమోదు చేసింది. అందరి కంటే ముందు సెమీస్​ చేరామన్న ఆనందం హర్మన్​సేనలో కనిపించింది. అయితే ఈ మ్యాచ్​కు ముందే ఓ సెక్యూరిటీ గార్డ్​తో స్టెప్పులేసి అదరగొట్టింది యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్జ్.

'లవ్‌ ఆజ్‌కల్‌' సినిమాలోని 'హా మై గలత్‌' పాటకు కాలు కదిపింది జెమీ. ఆ వీడియోను ఐసీసీ ట్వీట్ చేయగా, బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్​ రీట్వీట్ చేశాడు. ఓ హాస్యభరిత క్యాప్షస్ జోడించాడు.

"నాకిష్టమైన క్రికెటర్‌. హా మై గలత్‌!! దేశానికి ట్రోఫీ తీసుకురా జెమీ. ఇంకో డిమాండ్‌. డ్యాన్స్‌ చేసిన సెక్యూరిటీ గార్డ్‌ను బాలీవుడ్‌కు తీసుకొచ్చెయ్‌" -ట్విట్టర్​లో కార్తిక్ ఆర్యన్

2018లో భారత్ తరఫున అరంగేట్రం చేసింది జెమీమా. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. అంతేకాకుండా ఈమె రాక్​స్టార్. గిటార్ వాయించగలదు. పాటలు బాగా వింటుంది.

Last Updated : Mar 2, 2020, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.