ఈ ఏడాది ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ పాటిన్సన్. ఈ క్రమంలోనే క్వారంటైన్ పూర్తి చేసుకుని.. తొలి ప్రాక్టీస్ సెషన్‌ను ప్రారంభించాడు. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల లీగ్ నుంచి తప్పుకున్న శ్రీలంక బౌలర్ మలింగ స్థానంలో పాటిన్సన్ను ఎంచుకుంది ఫ్రాంచైజీ.
మంగళవారం పాటిన్సన్ నెట్ ప్రాక్టీసు చేస్తున్న వీడియోను ముంబయి ఫ్రాంచైజీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పాటిన్సన్ మాట్లాడుతూ.. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ ఎవరైనా ఉంటారంటే అది బుమ్రా అని తెలిపాడు.
-
📹 | Pattinson has joined the camp and is thrilled to partner with Boom and Boult! 💥⚡️#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL pic.twitter.com/2WAgKqi5Q7
— Mumbai Indians (@mipaltan) September 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">📹 | Pattinson has joined the camp and is thrilled to partner with Boom and Boult! 💥⚡️#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL pic.twitter.com/2WAgKqi5Q7
— Mumbai Indians (@mipaltan) September 15, 2020📹 | Pattinson has joined the camp and is thrilled to partner with Boom and Boult! 💥⚡️#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL pic.twitter.com/2WAgKqi5Q7
— Mumbai Indians (@mipaltan) September 15, 2020
"వ్యక్తిగతంగా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లతో కలిసి పనిచేయడం చాలా గొప్ప భావిస్తున్నా. ఇక బుమ్రా గురించి చెప్పాలంటే.. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ అతనే అని నా అభిప్రాయం. ముంబయి ఇండియన్స్ జట్టుతో కలిసి ఆడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా."
జేమ్స్ పాటిన్సన్, ఆసీస్ పేసర్
యూఏఈ వేదికగా లీగ్ జరగనున్న నేపథ్యంలో.. అక్కడి పిచ్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. "గతంలో ఇక్కడ కొన్ని వన్డే మ్యాచ్‌లు ఆడాను. కాబట్టి యూఏఈ పిచ్‌లపై కొంచెం అనుభవం ఉంది" అని పేర్కొన్నాడు.