ETV Bharat / sports

'అప్పుడు నాకు ఏం జరుగుతుందో చూడాలి?'

టీ20 ప్రపంచకప్​ గెలవాలనే పట్టుదలతో బాగా సిద్ధమయ్యామని చెప్పాడు పేసర్ బుమ్రా. కానీ కరోనా తమ ప్రణాళికలు తారుమారు చేసిందని అన్నాడు.

'అప్పుడు నాకు ఏం జరుగుతుందో చూడాలి?'
భారత పేసర్ బుమ్రా
author img

By

Published : Jun 1, 2020, 9:58 AM IST

లాక్​డౌన్​తో తర్వాత వేసే తొలి బంతికి తన శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలని ఉందన్నాడు టీమ్​ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​ కోసం భారత జట్టు బాగానే సిద్ధమైందని చెప్పాడు. ఐసీసీ వీడియో సిరీస్​ ఇన్​సైడ్ ఇంటర్వ్యూలో భాగంగా మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, షాన్ పొలాక్​లతో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నాడు.

"మేమే టీ20 ప్రపంచకప్​ కోసం బాగా సిద్ధమయ్యాం. షెడ్యూల్​ ప్రకారం టోర్నీకి ముందు చాలా టీ20 మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అంతా అనుకున్నట్లు జరుగుంటే ఐపీఎల్, పొట్టి ఫార్మాట్​ మ్యాచ్​లా చాలానే ఆడేవాళ్లం. మా ఆలోచన అంతా కప్పు గెలవాలనే" -బుమ్రా, భారత ప్రముఖ బౌలర్

టీ20 ప్రపంచకప్​.. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబరు 18- నవంబరు 15 మధ్య జరగాల్సి ఉంది. అయితే ప్రాణాంతక కరోనా వల్ల ఇప్పటికే చాలా క్రీడలు వాయిదా పడ్డ నేపథ్యంలో, ఈ టోర్నీకి అలాంటి పరిస్థితే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

ICC T20 WORLD CUP 2020
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2020

అదే విధంగా బౌలింగ్ చేసే చాలారోజులైందని చెప్పిన బుమ్రా.. లాక్​డౌన్​ తర్వాత తొలి బంతి వేసేటప్పుడు తన శరీరం ఎలా స్పందింస్తుందో చూడాలని అన్నాడు. అయితే ప్రస్తుతం ఫిట్​నెస్​పై దృష్టిపెట్టినట్లు చెప్పాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.