ఉత్తరాఖండ్ క్రికెట్ ప్రధాన కోచ్గా తప్పుకుంటూ వసీమ్ జాఫర్ తీసుకున్న నిర్ణయాన్ని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సమర్థించాడు. అతడు వైదొలగడం ఆటగాళ్లను తీవ్ర నష్టమని అభిప్రాయపడ్డాడు.
"నీకు మద్దతిస్తున్నా వసీమ్. సరైన పనే చేశావు. నీ మార్గదర్శకత్వం కోల్పోవాల్సి రావడం క్రికెటర్ల దురదృష్టం." అని అనిల్ కుంబ్లే ట్వీట్ చేశాడు.
ఉత్తరాఖండ్ ప్రధాన కోచ్గా దేశవాళీ క్రికెట్ దిగ్గజం వసీమ్ జాఫర్ మంగళవారం వైదొలిగాడు. తనపై చేసిన మతపరమైన ఆరోపణలు చాలా బాధపెట్టాయని అన్నాడు. జట్టు ఎంపికలో సెలక్షన్ కమిటీ, ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం(సీఏయూ) కార్యదర్శి మహిమ్ వర్మ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని చెప్పాడు. అర్హత కలిగిన అభ్యర్థులను చాలా ప్రోత్సహించానని జాఫర్ తెలిపాడు. నిజంగానే ఓ మతానికి చెందిన క్రికెటర్లకు బాసటగా నిలిస్తే తనను తొలగించేవారని, తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదని వివరించాడు.
ఇదీ చూడండి: ఆ వ్యాఖ్యలు చాలా బాధించాయి: వసీమ్ జాఫర్