ETV Bharat / sports

'అండర్-19 ప్రపంచకప్​ గెలిచినా అవకాశాలు రాలేదు' - జాతీయ జట్టులో అందుకే చోటు దక్కించుకోలేకపోయాను

అండర్​-19 ప్రపంచకప్​లో భారత జట్టును విజేతగా నిలిపినా.. జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు యువ క్రికెటర్​ ఉన్ముక్త్ చంద్. తాజాగా తన కెరీర్​ గురించి పలు విషయాలు తెలిపాడు ​.

inmukh
ఉన్ముక్​ చంద్​
author img

By

Published : Jun 8, 2020, 2:14 PM IST

అండర్​-19 ప్రపంచకప్​లో భారత జట్టును విజేతగా నిలిపిన ఆటగాడు ఉన్ముక్త్​ చంద్​. అతని బ్యాటింగ్​ ప్రతిభను చూసి మరో కోహ్లీలా ఆడుతున్నాడని అనిపించుకున్నాడు. 67 ఫస్ట్​ క్లాస్​ మ్యాచుల్లో 3వేల 379 పరుగులు చేశాడు. ఇంతటి పేరు సంపాదించిన ఈ ఆటగాడికి జాతీయ జట్టులో మాత్రం చోటు లభించలేదు. అయితే తాజాగా ఆకాశ్​ చోప్రా నిర్వహించిన ఓ షోలో పాల్గొన్న ఉన్ముక్త్​​.. జాతీయ జట్టులో చోటు లభించకపోవడం సహా పలు విషయాలు పంచుకున్నాడు.

"అండర్​-19 జట్టులో ఉన్న ఏ ఆటగాడికైన ప్రపంచకప్​ సాధించడం అనేక ఎంతో ముఖ్యమైన విషయం. అలాగే జూనియర్​, అండర్​-16 ఇతరత్రా ఏ జట్టులోని ఆటగాడైనా ఏళ్ల తరబడి కష్టపడేది ఈ ప్రపంచకప్​ సాధించడానికే. నాకంటే ముందు విరాట్​ కోహ్లీ సారథ్యంలో అండర్​-19 జట్టు ప్రపంచ కప్​ సాధించింది. ఆ ప్రభావం నాపై గట్టిగా పడింది. అలాగే నా సారథ్యంలోనూ ప్రపంచకప్​ను గెలిచాం. కానీ ఆ తర్వాత నాకు అవకాశాలు సరిగా రాలేదు. నేను భారత్​- ఏ జట్టుకు 2016 వరకు సారథ్యం వహించాను. ఎన్నో పరుగులు చేశాను. జాతీయ జట్టులో చోటు దక్కుతుందనే దృక్ఫథంతోనే ఆడేవాడిని. కానీ చివరికి చోటు దక్కలేదు. ఏదిఏమైనప్పటికీ మనం ఏం సాధించామనేది కాకుండా ఏమి నేర్చుకున్నామన్నదే ముఖ్యం. కొన్ని సందర్భాల్లో జాతీయ జట్టులో కాంబినేషన్స్​ అనేవి చాలా ముఖ్యం. నేను మెరుగ్గా ఆడే సమయంలో ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్​, గౌతమ్​ గంభీర్​ ఉన్నారు. జట్టుకు ఓపెనర్ల కొరత వచ్చే సమయానికి నేను ఫామ్​ కోల్పోయా."

-ఉన్ముక్​ చంద్​, క్రికెటర్​.

ప్రస్తుతం ఉత్తరాఖండ్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఉన్ముక్త్. 2017 నుంచి ఐపీఎల్​లోని ఏ జట్టు ఇతడిని తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు.​

ఇది చడండి : చివరి బంతికి సిక్స్​తో సెంచరీ చేసిన క్రికెటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.