ETV Bharat / sports

'ఈసారి స్నేహానికి చోటు లేదు.. యుద్ధమే'

ఇంగ్లాండ్​ పేసర్​ జోఫ్రా ఆర్చర్​కు ఓ హెచ్చరిక చేశాడు వెస్టిండీస్​ బౌలర్​ కీమర్​​ రోచ్​. జూన్​ 8 నుంచి ఇరువురి మధ్య జరగబోయే ద్వైపాక్షిక సిరీస్​లో స్నేహానికి తావు లేదన్నాడు. కేవలం ఇంగ్లీష్​ జట్టును ఓడించడమే తమ లక్ష్యమని తెలిపాడు.

kemer roach
కీమర్​​ రోచ్
author img

By

Published : Jun 15, 2020, 10:40 PM IST

ఇంగ్లాండ్​ జట్టుతో స్నేహం అనే పదానికి చోటే లేదంటున్నాడు వెస్టిండీస్​ బౌలర్​​ కీమర్​​ రోచ్​. ఇదే విషయంపై ఇంగ్లీష్​ పేసర్​ జోఫ్రా ఆర్చర్​కు ఓ హెచ్చరిక జారీ చేశాడు. త్వరలో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్​లో ఇంగ్లీష్​ జట్టును ఓడించడమే లక్ష్యంగా తమ జట్టు కసరత్తులు చేస్తోందని తెలిపాడు. అందుకోసం అద్భుతమైన ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించాడు.

"ఈసారి జరగబోయే సిరీస్​లో ఇంగ్లీష్​ జట్టుపై చెలరేగిపోతా. బాగా శ్రమించి గెలుపొందడమే మా జట్టు ధ్యేయం. ఇంగ్లీష్ జట్టుతో స్నేహానికి చేయి కలపం. ఇక జోఫ్రా ఆర్చర్ విషయానికొస్తే అతడికి అడ్డుకట్ట వేయడానికి ఓ ప్రత్యేకమైన ప్రణాళిక కూడా రచించాం. ఈ యుద్ధం ఎప్పుడెప్పుడు జరగుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. మేము తప్పకుండా విజయం సాధిస్తామని భావిస్తున్నా."

-కీమర్​​ రోచ్​, వెస్టిండీస్​ బౌలర్​

బంతికి ఉమ్మును రాయడాన్ని నిషేధించింది ఐసీసీ. దీనిపై రోచ్​ స్పందిస్తూ.. ఈ నిబంధన బౌలర్లకు ఓ సవాల్​ లాంటిదని అన్నాడు.

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య మూడు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్​ జులై 8 నుంచి ప్రారంభంకానుంది. ప్రేక్షకులు లేకుండానే దీనిని నిర్వహిస్తున్నారు. జులై 8 నుంచి 12 వరకు తొలి టెస్టు జరుగుతుంది. అనంతరం ఎమిరేట్స్​ ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా జులై 16 నుంచి 20, 24 నుంచి 28 వరకు రెండు, మూడు టెస్టులు జరుగుతాయి.

jophra archer
జోఫ్రా ఆర్చర్​కు

ఇది చూడండి : టీమ్​ఇండియాలో స్మిత్​కు ఇష్టమైన క్రికెటర్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.