నిషేధం కొనసాగుతున్న కాలమంతా తనకు నరకంలా కనిపించిందన్నాడు యువక్రికెటర్ పృథ్వీషా. గతేడాది డోపింగ్‌లో విఫలమై ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొన్నాడు. చిన్న పొరపాటుతో పట్టుపడటమే కాకుండా కొందరు చేస్తున్న విమర్శలు తనను ఎంతో బాధ పెట్టాయన్నాడు. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు ఓ సలహా ఇచ్చాడు.
"మీరు తినే ప్రతిదానిపై జాగ్రత్తగా ఉండాలి. పారాసిటమల్ వంటి సాధారణ మందునైనా డాక్టర్ల సలహా తీసుకొని వాడండి. వైద్యులు సూచించిన మందులనే వాడటం ఉత్తమం. వారిని సంప్రదించటం వల్ల మీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోరు. ఇది తెలియని వారంతా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది."
- పృథ్వీషా, టీమ్ఇండియా ఆటగాడు
తాను చేసిన తెలియని తప్పుకు చింతిస్తున్నట్లు తెలియజేశాడు షా. చిన్న దగ్గు మందులో నిషేధిత ఉత్ప్రేరకాలు ఎందుకుంటాయనే భావనతో దాన్ని వాడినట్లు తెలిపాడు. దాని వల్ల ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డానని అన్నాడు.
ఇదీ చూడండి.. వీడియో కాల్ ద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ పరీక్షలు