యుద్ధంలో సైనికుడికి కత్తి ఎంత అవసరమో.. క్రికెట్లో బ్యాట్స్‌మన్‌కు బ్యాట్ అంతే ముఖ్యం. దీంతో పాటు ఇంకో రెండు వస్తువులు కూడా ఎంతో కీలకం! అందులో ఒకటేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అదే జాక్స్ట్రాప్.. మన భాషలో చెప్పాలంటే గార్డ్. రెండోది హెల్మెట్. అయితే ఈ రెండింట్లో ఏది ముందు ఉపయోగించారో తెలుసా! రెండూ ఒకేసారి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ముందుగా గార్డ్‌ను వినియోగించారు.
గార్డ్‌ను 1874లో తొలిసారి ఉపయోగించారు. హెల్మెట్ మాత్రం ఆలస్యంగానే వినియోగంలోకి వచ్చింది. ఆ ఆలస్యం ఎంతంటే... దాదాపు వందేళ్లు. 1970వ దశకం వరకు క్రికెట్లో హెల్మెట్‌ను వాడలేదు. మొదటగా వరల్డ్ సిరీస్ క్రికెట్లో డెన్నిస్ అమీస్ అనే ఆటగాడు భద్రత కోసం మొదటిసారి శిరస్త్రాణాన్ని ఉపయోగించాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రం 1978 నుంచి వాడుకలోకి వచ్చింది. ఆస్ట్రేలియా ఆటగాడు గ్రాహమ్ యాల్లోప్ తొలిసారి హెల్మెట్ ధరించి మ్యాచ్ ఆడాడు.
ప్రస్తుతం హెల్మెట్, గార్డ్‌కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఔత్సాహికులు చర్చించుకుంటున్నారు. ఈ రెండింటికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. క్రికెట్లో హెల్మెట్ అవసరం గురించి వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు నెటిజన్లు. మెదడు కూడా ముఖ్యమని తెలుసుకోవడానికి వందేళ్లు పట్టింది అని ఫొటో షేర్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: హీరో విశాల్‌తో గుత్తాజ్వాల డేటింగ్.. ఫొటోలు వైరల్!