టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ టెస్టు పాసయ్యాక జాతీయ క్రికెట్ అకాడమీ ట్రైనర్ ఆశిష్ కౌశిక్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. జనవరిలో విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఇషాంత్ చీలమండకు తీవ్ర గాయమైంది. అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన లంబో.. తాజాగా కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ పరీక్ష పాసయ్యాడు.
"జనవరి 20న చీలమండకు గాయమైన తర్వాత నాకు రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించింది. కానీ, ఆశిష్ కౌశిక్ సహకారంతో దాన్ని అధిగమించా. ఆ గాయాన్ని స్కానింగ్ చేస్తే కాస్త భయమేసింది. ఇప్పుడు ఫిట్‌నెస్ సాధించడం వల్ల సంతోషంగా ఉన్నా. ధన్యవాదాలు ఆశిష్ కౌశిక్."
-ఇషాంత్ శర్మ, టీమిండియా పేసర్
ఈ నెల 21 నుంచి భారత్ -న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ఫిట్‌నెస్ టెస్టు పాసైన కారణంగా ఇషాంత్ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.