బంగ్లాదేశ్తో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో భారత బౌలర్ ఇషాంత్ శర్మ.. 22 పరుగులిచ్చి 5 వికెట్లతో రాణించాడు. గులాబి బంతితో చెలరేగి, ప్రత్యర్థి జట్టు 106 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టీమిండియా బౌలర్ల మధ్య ఉన్న ఆరోగ్యకర పోటీనే ఈ ప్రదర్శనకు కారణమన్నాడు.
"మా (భారత బౌలర్లు) మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. అదే, నా ప్రదర్శన మెరుగుపడేందుకు కారణమైంది. ఒకవేళ బౌలర్ల మధ్య పోటీ లేకపోతే చేసే పనిని ఆస్వాదించలేం. ఛాలెంజ్ విసిరే వారు ఎవరూ లేకపోతే, ప్రదర్శన ఆశించిన మేర ఉండకపోవచ్చు" -ఇషాంత్ శర్మ, భారత బౌలర్
ప్రస్తుతం 96వ టెస్టు ఆడుతున్న ఇషాంత్.. ఈ ఫార్మాట్లో 287 వికెట్లు తీశాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇన్నింగ్స్లో 5 వికెట్ల ఘనత సాధించాడు.
డే/నైట్ టెస్టు తొలిరోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 174 పరుగులతో నిలిచింది భారత్. 68 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 59, అజింక్య రహానే 23 ఉన్నారు.
ఇది చదవండి: పింక్ టెస్టు: తొలిరోజు కోహ్లీసేనదే.. ఆధిక్యంలో భారత్