ETV Bharat / sports

'నేను, ఇషాంత్ జీవితకాల సోదరులం'

author img

By

Published : Jul 2, 2020, 9:30 AM IST

టీమ్‌ఇండియా క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మ తనను క్షమాపణలు కోరాడని వెస్టిండీస్‌ క్రికెటర్‌ డారెన్‌ సామి తెలిపాడు. బహుశా అతడు దురుద్దేశంతో అలా (కాలూ) సంబోధించి ఉండడని పేర్కొన్నాడు. ఈ విషయం ఇక్కడితో వదిలేసి ముందుకు వెళ్తామని వెల్లడించాడు. క్రికెట్లో మాత్రం జాతి వివక్షకు తావు ఉండకూడదని స్పష్టం చేశాడు.

Ishant Sharma apology to Saami
సామి

అమెరికాలోని ఓ పోలీసు అధికారి జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడి మెడపై కాలు అదిమిపెట్టడం వల్ల అతడు మరణించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా "నల్ల జాతీయుల ప్రాణాలూ విలువైనవే" (#BlackLivesMatter) అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిరసనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్లోనూ జాతి వివక్ష ఉందని వెస్టిండీస్ క్రికెటర్ డారెస్‌ సామి అన్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్నప్పుడు కొందరు తనను 'కాలూ' (నల్లనివాడు) అని పిలిచారని తెలిపాడు. ఇషాంత్‌ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో సామిని కాలూ అని సంబోధించిన పోస్ట్‌ను చూపాడు. తాజాగా ఈ విషయంపై ఇషాంత్ తనను క్షమాపణ కోరినట్లు చెప్పాడు సామి.

"వర్ణవ్యవస్థను ఏయే సంస్కృతులు ఎలా చూస్తాయో, గౌరవిస్తాయో తెలుసుకోవడం అవసరం. ఇషాంత్‌ నన్ను తెలియక అనుండొచ్చు. ఏదేమైనప్పటికీ తక్కువచేసే పదాలను త్యజించాలి. నేనతడితో ఫోన్‌లో సంభాషించా. దీన్ని దాటేసి ముందుకు వెళ్తున్నా" అని సామి అన్నాడు. కాగా ఇషాంత్‌పై తనకు ఆగ్రహం లేదని, మళ్లీ కలిసినప్పుడు మనసారా కౌగిలించుకుంటానని పేర్కొన్నాడు.

"ఆటగాడు, మెంటార్‌, కోచ్‌ మరేదైనా పాత్రలో భారత్‌కు తిరిగి రావడం నాకిష్టం. అక్కడ నాకు మధుర స్మృతులు ఉన్నాయి. ఇషాంత్‌ ఇంట్లో మేమందరం చేతులు కలిపిన ఓ పెద్ద చిత్రం ఉంటుంది. జీవితాంతం సోదరులే అని రాసున్న ఆ చిత్రంపై నేనూ సంతకం చేశా. ఈ విషయాన్ని నేనింకా లాగను. ఎందుకంటే దృష్టి సారించాల్సిన పెద్ద అంశాలు మరెన్నో ఉన్నాయి" అని సామి తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.