భారత స్టార్ పేసర్ బుమ్రాను.. బేబీ బౌలర్ అని ఇటీవలే వార్తల్లో నిలిచాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్. ఆ తర్వాత అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అతడి ఆటపైనా ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రజాక్‌పై వ్యంగాస్త్రాలు సంధించాడు. టీమిండియా అభిమానులు.. అలాంటి స్టేట్మెంట్లకు స్పందించాల్సిన అవసరం లేదని, చదివి నవ్వకుంటే చాలని ట్వీట్ చేశాడు.
-
“Irfan jese bowlers hamari gali gali mein paae jate hay” par jab jab ye galli bowler inke samne khela har baar inki gilliyan nikal ke rakh di. Request to all fans not to pay any heat to those unnecessary over the top statements. Just read and 😃.... #bumrah #ViratKohli
— Irfan Pathan (@IrfanPathan) December 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">“Irfan jese bowlers hamari gali gali mein paae jate hay” par jab jab ye galli bowler inke samne khela har baar inki gilliyan nikal ke rakh di. Request to all fans not to pay any heat to those unnecessary over the top statements. Just read and 😃.... #bumrah #ViratKohli
— Irfan Pathan (@IrfanPathan) December 5, 2019“Irfan jese bowlers hamari gali gali mein paae jate hay” par jab jab ye galli bowler inke samne khela har baar inki gilliyan nikal ke rakh di. Request to all fans not to pay any heat to those unnecessary over the top statements. Just read and 😃.... #bumrah #ViratKohli
— Irfan Pathan (@IrfanPathan) December 5, 2019
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రజాక్.. మెక్‌గ్రాత్, వసీమ్ అక్రమ్ లాంటి మేటి పేసర్లతో పోలిస్తే బుమ్రా ఓ బచ్చా బౌలర్ అని అన్నాడు. అతడి బౌలింగ్‌ను సులభంగా ఆడేస్తానని చెప్పాడు.
తన కెరీర్లో రజాక్.. 46 టెస్టులు, 256 వన్డేలు, 32 టీ20ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతడి బ్యాటింగ్ సరాసరి 30 కంటే తక్కువే.
బుమ్రా.. ఫిట్నెస్ సమస్యల కారణంతో గత మూడు నెలలుగా క్రికెట్ ఆడకపోయినా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే ఉన్నాడు. ప్రస్తుతం కసరత్తులు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ బౌలర్.. త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.