రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న మరో క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. "ప్రస్తుతం క్వారంటైన్లో ఉంటున్నాను. ఇటీవల నాతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానని" ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
"దయచేసి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి. అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా" అని ఇర్ఫాన్ తెలిపాడు. రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న సచిన్ తెందూల్కర్‌తో పాటు యూసుఫ్ పఠాన్, బద్రీనాథ్‌కు కూడా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ఇదీ చదవండి: 'ధోనీ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా'