ETV Bharat / sports

ఐపీఎల్​ షెడ్యూల్​పై స్పష్టత వచ్చేది అప్పుడే!

ఐపీఎల్​ షెడ్యూల్​ గురించి చర్చించేందుకు పాలక మండలి మరో పది రోజుల్లో సమావేశం కానుంది. లీగ్​ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ.. ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు అధికారులు తెలిపారు.

IPL's
ఐపీఎల్​
author img

By

Published : Jul 21, 2020, 4:18 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణపై పాలక మండలి ఛైర్మన్​ బ్రిజేష్​ పటేల్​ కీలక ప్రకటన చేశారు. మరో వారం- పది రోజుల్లో లీగ్​ షెడ్యూల్​పై చర్చించేందుకు సమావేశం జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఐపీఎల్​ ముందుకు సాగేలా బీసీసీఐ.. ప్రభుత్వ అనుమతి కోరుతుందని పేర్కొన్నారు.

IPL's
ఐపీఎల్​

"సెప్టెంబరు వరకు కరోనాతో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తూనే ఉంటాం. ఆ తర్వాతే టోర్నమెంటును భారత్​లో జరపాలా, యూఏఈలో నిర్వహించాలా అని నిర్ణయిస్తాం. ఇందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి."

-బ్రిజేష్​ పటేల్​, ఐపీఎల్​ పాలక మండలి ఛైర్మన్

కొవిడ్​ వ్యాప్తి కారణంగా టీ20 ప్రపంచ కప్​-2020ను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్​పై ఆశలు చిగురించాయి. భారత్​లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో లీగ్​ను ఎక్కడ నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.