ETV Bharat / sports

ఐపీఎల్​ ఫ్రాంచైజీ రేసులో అహ్మదాబాద్, కాన్పూర్ - కొత్త జట్లు చేరనున్నాయి

వచ్చే ఏడాది ఐపీఎల్​లో మరో రెండు జట్లను కొత్తగా చేర్చేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ ఏర్పాటు చేసేందుకు అహ్మదాబాద్ సిటీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరో ఫ్రాంచైజీ రేసులో లఖ్​నవూ, కాన్పూర్​ ఉన్నాయి.

Ahmadabad franchise in IPL
ఐపీఎల్​ ఫ్రాంచైజీ రేసులో అహ్మదాబాద్ సిటీ
author img

By

Published : Dec 4, 2020, 12:31 PM IST

రానున్న ఐపీఎల్ సీజన్​లో రెండు కొత్త జట్లను చేర్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి ఫ్రాంచైజీగా అహ్మదాబాద్ సన్నద్ధమవుతుండగా రెండో జట్టు రేసులో కాన్పూర్, లఖ్​నవూ సిటీలు ఉన్నాయి. అయితే ఈ జట్ల చేరిక విషయం మాత్రం బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు.

ఒకవేళ ఈ అంశంపై భారత క్రికెట్ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటే.. ఐపీఎల్​14వ సీజన్​లో పాల్గొనేందుకు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉందని ఇన్​సైడ్ స్పోర్ట్ నివేదిక పేర్కొంది. మరో 3-4 వారాల్లో బీసీసీఐ తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపింది.

వచ్చే ఏడాది ఐపీఎల్​లో కొత్త జట్ల చేరిక విషయంపై డిసెంబర్ 24న బీసీసీఐ సమావేశంలో చర్చించనున్నారు. ఈ తరుణంలో ఫ్రాంచైజీని ఏర్పాటు చేసేందుకు అదానీ, గోయెంక సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:కోహ్లీ, సచిన్​పై జాఫర్ మీమ్.. నెట్టింట వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.