ETV Bharat / sports

ఐపీఎల్​: తొలి మ్యాచ్​లో బెంగళూరు-కోల్​కతా ఢీ!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదమూడో సీజన్​కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇందుకు సంబంధించి ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టింది ఐపీఎల్. ఇది అభిమానుల్ని అయోమయంలో పడేసింది.

ఐపీఎల్​: తొలి మ్యాచ్​లో బెంగళూర్-కోల్​కతా ఢీ!

author img

By

Published : Sep 5, 2020, 6:06 PM IST

ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. అయితే నిర్వాహకులు ఇంకా మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల చేయలేదు. దీనిపై పాలకమండలి ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టతనిస్తూ రేపు (ఆదివారం) షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించారు.

కాగా ఐపీఎల్‌ నిర్వాహకులు శనివారం ట్విట్టర్​లో ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను‌ విడుదల చేశారు. 'డ్రీమ్‌ 11 ఐపీఎల్‌కు ఇంకా 14 రోజులే మిగిలి ఉన్నాయి. ఆగలేకపోతున్నాం' అని పేర్కొంటూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్లు విరాట్‌ కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌ల ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

సహజంగా ఎప్పుడైనా గతేడాది ఫైనల్‌కు చేరిన జట్లతోనే ఏటా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అది ఆనవాయితి. గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తుదిపోరులో తలపడ్డాయి. దీంతో ఈ రెండు జట్లతోనే ఈసారి పదమూడో సీజన్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ కన్నా ముందు మొదటిసారి విడుదల చేసిన షెడ్యూల్‌లో.. మార్చి 29న ఈ జట్లతోనే టోర్నీని మొదలుపెట్టాలని చూశారు. కరోనా పరిస్థితుల కారణంగా మెగా లీగ్ ఆరు నెలలు వాయిదా పడింది.

ఇప్పుడు మళ్లీ ఆ జట్లతోనే ప్రారంభించాల్సి ఉన్నా.. ఇటీవల చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు కరోనా బారిన పడటం, ఆ జట్టు క్వారంటైన్‌ గడువు పెరగడం వల్ల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాగా రైనా, భజ్జీలాంటి స్టార్‌ ఆటగాళ్లు కూడా ఆ జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఇలా కోహ్లీ, దినేశ్‌ కార్తిక్‌ల పోస్టర్‌ను విడుదల చేసి ఆసక్తి పెంచింది ఐపీఎల్. అయితే, దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.