ETV Bharat / sports

'ఐపీఎల్​ లోగో ఇతడిని చూసే డిజైన్ చేశారా?' - ఐపీఎల్ లోగో డివిలియర్స్

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో తన బ్యాటింగ్​తో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుకు విజయాన్ని అందించాడు ఏబీ డివిలియర్స్. ఈ క్రమంలోనే ఇతడి బ్యాటింగ్​ను కొనియాడాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

AB de Villiers
డివిలియర్స్
author img

By

Published : Apr 10, 2021, 12:45 PM IST

ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​కు షాకిచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్​లో రెండు వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో బోణీ కొట్టింది. అయితే ఆర్సీబీ విజయంలో ఆ జట్టు ప్రధాన బ్యాట్స్​మన్ ఏబీ డివిలియర్స్ కీలకపాత్ర పోషించాడు. ఒత్తిడిలోనూ గొప్పగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే ఇతడి బ్యాటింగ్​పై ప్రశంసలు కురిపించాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.

డివిలియర్స్ బ్యాటింగ్ అద్భుతమని కొనియాడాడు సెహ్వాగ్. అలాగే ఐపీఎల్​ లోగోనూ రహస్యంగా డివిలియర్స్​ బాదిన షాట్​ నుంచే తీసుకున్నట్లు తెలిపాడు. ఏబీడీ షాట్లను చూసి యాజమాన్యం ఈ లోగో డిజైన్ చేసి ఉంటుందని ట్వీట్ చేశాడు.

  • Will power = De villiers Power.
    Defeats all power.

    No wonder the @IPL logo is secretly designed after @ABdeVilliers17 . Champion knock. But Patel Bhai ke raaz mein , RCB bowling mazaa aaya. Top spell 5/27. Is saal cup aande , no vaandey. #RCBvsMI pic.twitter.com/NcPBRzaRrd

    — Virender Sehwag (@virendersehwag) April 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (49), సూర్యకుమార్ (31) ఆకట్టుకున్నారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయం సాధించింది. డివిలియర్స్ 27 బంతుల్లో 48 పరుగులతో సత్తాచాాటాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.