ETV Bharat / sports

ఐపీఎల్​లో చైనా స్పాన్సర్లకు అనుమతి.. పాలకమండలి నిర్ణయం - ఐపీఎల్ యూఏఈ

IPL GC Meet
ఐపీఎల్​లో చైనా స్పాన్సర్లకు అనుమతి
author img

By

Published : Aug 2, 2020, 9:11 PM IST

Updated : Aug 2, 2020, 9:30 PM IST

21:06 August 02

సెప్టెంబరు 19 నుంచి లీగ్​ ప్రారంభం

ఐపీఎల్ పాలకమండలి సమావేశం ముగిసింది. ముందు చెప్పినట్లు సెప్టెంబరు 19 నుంచి లీగ్​ ప్రారంభమవుతుందని తెలిపారు. ఫైనల్ మాత్రం నవంబరు 10న నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. అయితే చైనా స్పాన్సర్​ వివోతో పాటు అన్ని స్పాన్సర్లకు అనుమతినిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు.

కేంద్ర హోం శాఖ.. మరో వారంలో ఈ విషయంపై ఆమోదం తెలపనుందని పాలకమండలి అధికారి చెప్పారు. ఫైనల్ నవంబరు 10న జరుగుతుందని అన్నారు. దీనితో పాటే మహిళ ఐపీఎల్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే పురుషుల ఐపీఎల్​లో ఈసారి ప్రతి జట్టులో 24 మంది ఆటగాళ్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

అయితే దుబాయ్​కు చెందిన ఓ సంస్థ యూఏఈ వైద్యసదుపాయాలపై ప్రజంటేషన్​ బీసీసీఐకి ఇచ్చింది. అయితే బోర్డు మాత్రం బయో బబుల్ సృష్టించే విషయమై టాటా గ్రూప్​తో చర్చలు జరుపుతోంది.

Last Updated : Aug 2, 2020, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.