ETV Bharat / sports

అలా అయితే ఐపీఎల్ అక్టోబర్​లో ప్రారంభం! - BCCI Official about IPL

ఐపీఎల్​ 13వ సీజన్​పై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్​ 15న ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఈ లీగ్​ను అక్టోబర్​-నవంబర్​లో జరిపే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు నిర్వాహకులు. తాజాగా దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు.

ఐపీఎల్
ఐపీఎల్
author img

By

Published : Mar 31, 2020, 5:20 PM IST

ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఈ టోర్నీ ఏప్రిల్ 15కు వాయిదాపడింది. కానీ ఆ తేదీనా జరిగే అవకాశం లేకపోయింది. అందుకు కారణం దేశంలో లాక్​డౌన్​ను ఏప్రిల్ 14 వరకు పొడిగించడమే. అయితే ఈ ఐపీఎల్​ అక్టోబర్-నవంబర్​లో జరిగే అవకాశముందని వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఓ బీసీసీఐ అధికారి మాట్లాడారు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఐపీఎల్​ను అక్టోబర్​లో ప్రారంభించే వీలుందని అన్నారు.

"ప్రస్తుత పరిస్థితుల్లో దేశాలన్నీ లాక్​డౌన్​ విధించాయి. ఆస్ట్రేలియా ఆరు నెలల పాటు అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటన్ కూడా అదే దారిలో వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అందువల్ల ఐపీఎల్​ను అక్టోబర్-నవంబర్​లో నిర్వహిస్తేనే బాగుంటుంది. కానీ ఆ సమయంలో టీ20 ప్రపంచకప్​ ఉంది. ఒకవేళ ఐసీసీ ఈ మెగాటోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తే అప్పుడు ఐపీఎల్​ను అక్టోబర్-నవంబర్​లో నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఐసీసీ చెబుతోన్న ప్రకారం టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది."

-బీసీసీఐ అధికారి

ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మెగాటోర్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఆశిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్ రాబర్ట్స్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.