ETV Bharat / sports

చెన్నైకి మొయిన్ అలీ.. పంజాబ్​కు మలన్​ - apl 2021

ఐపీఎల్​ 2021 వేలంలో ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ మొయిన్​ అలీని రూ.7 కోట్లకు చెన్నై జట్టు దక్కించుకుంది. బంగ్లా ఆల్​రౌండర్​ షకిబుల్​ను రూ.3.2 కోట్లకు కోల్​కతా కొనుగోలు చేసింది.

ipl-auction-2021
రూ.7 కోట్లకు మొయిన్​ అలీ చెన్నై సొంతం
author img

By

Published : Feb 18, 2021, 4:14 PM IST

చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్​ స్పిన్​ ఆల్​రౌండర్​ మొయిన్​ అలీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో బెంగళూరుకు ఆడిన అలీని తాజాగా సీఎస్​కే దక్కించుకుంది.

బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​ను కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టు రూ.3.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు ఏడు సీజన్లలో షకిబ్​ ఇదే జట్టుకు ఆడాడు. చివరగా సన్​రైజర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు.

రూ.50 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్న భారత ఆటగాడు శివం దూబేను రాజస్థాన్​ రాయల్స్​ జట్టు కొనుగోలు చేసింది. రూ.4.4 కోట్లకు రాయల్స్ ఫ్రాంచైజీ ఇతడిని దక్కించుకుంది.

ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్, టీ20 నెంబర్ వన్ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్​ను కనీస ధర 1.5 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.