సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా ప్రధాన బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా ఎట్టకేలకు తిరిగి ఐపీఎల్లో ఆడనున్నాడు. గురువారం చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల బేస్ ప్రైస్‌కే అతన్ని సొంతం చేసుకుంది.
"వేలం ద్వారా లెజెండ్ ఛెతేశ్వర్ను మేం సీఎస్కేలోకి చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం. విజిల్‌పోడు. సూపర్ ఆక్షన్." అని సీఎస్కే తన అధికారిక ట్విట్టర్ పేజీలో రాసుకుంది.
-
We welcome the legend, Che #Bujji with a super cute applause from the auction hall! #WhistlePodu #SuperAuction 🦁💛 pic.twitter.com/6RdJkKBy5O
— Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We welcome the legend, Che #Bujji with a super cute applause from the auction hall! #WhistlePodu #SuperAuction 🦁💛 pic.twitter.com/6RdJkKBy5O
— Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021We welcome the legend, Che #Bujji with a super cute applause from the auction hall! #WhistlePodu #SuperAuction 🦁💛 pic.twitter.com/6RdJkKBy5O
— Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021
గత నెలలో ఐపీఎల్ ఆడాలన్న తన అభిలాషను వ్యక్తం చేశాడు పుజారా. టెస్టు క్రికెట్‌కు సరిగ్గా సరిపోయే అతని బ్యాటింగ్ శైలి వల్ల అతనికి పొట్టి ఫార్మాట్లో అంతగా అవకాశాలు రాలేదు.
చివరిసారిగా 2014లో పంజాబ్ కింగ్స్(పాత పేరు కింగ్స్ ఎలెవన్ పంజాబ్) తరఫున ఐపీఎల్లో ఆడిన ఈ నయావాల్.. 30 మ్యాచ్‌ల్లో 390 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 83 టెస్టులు ఆడిన పుజారా 13,834 పరుగులు సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడి 130 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతవరకు ఒక్క టీ20 మ్యాచ్ ఆడకపోవడం గమనార్హం.
థ్యాంక్స్ చెన్నై..
తనపై నమ్మకం ఉంచినందుకు పుజారా.. చెన్నై ఫ్రాంఛైజీకి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
-
Thank you for showing the faith 🙏
— cheteshwar pujara (@cheteshwar1) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Look forward! https://t.co/t7QlT6SGW1
">Thank you for showing the faith 🙏
— cheteshwar pujara (@cheteshwar1) February 18, 2021
Look forward! https://t.co/t7QlT6SGW1Thank you for showing the faith 🙏
— cheteshwar pujara (@cheteshwar1) February 18, 2021
Look forward! https://t.co/t7QlT6SGW1
ఇదీ చదవండి: కేకేఆర్‌కు భజ్జీ.. సన్‌రైజర్స్ గూటికి జాదవ్