కోల్‌కతా వేదికగా ఈరోజు జరుగుతున్న 2020 ఐపీఎల్ వేలంలో.. భారత యువ బౌలర్ జయ్‌దేవ్ ఉనద్కత్ రూ.3 కోట్ల ధర పలికాడు. ఇతడి కనీస ధర రూ.కోటి. రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాడిని తీసుకోవడం వరుసగా ఇది మూడోసారి కావడం విశేషం.
గతంలో...
2018లో అత్యధిక ధర రూ.11.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన రాజస్థాన్ గతేడాది 8.40 కోట్లకు తీసుకుంది. అయితే ఆ రెండు సీజన్లలో ఉనద్కత్ ఆశించినంత మేర రాణించలేదు.
2018లో 15 మ్యాచ్‌లు ఆడిన ఉనద్కత్ 11 వికెట్లు తీయగా 2019లో 11 మ్యాచ్‌లాడి 10 వికెట్లే తీశాడు. ఇదిలా ఉండగా జయ్‌దేవ్ అత్యధికంగా ఐపీఎల్‌లో తొమ్మిది సార్లు వేలంలో పాల్గొన్న ఆటగాడిగా నిలిచాడు.