ముంబయి ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో మెప్పించాడు ఆర్సీబీ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. 28 బంతుల్లో 39 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే గతేడాది పంజాబ్‌కు ఆడిన ఇతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇతడిని ఈ సీజన్‌కు ముందు వదులుకుంది పంజాబ్. ఆ తర్వాత వేలంలో మ్యాక్సీని భారీ ధరకు కొనుగోలు చేసింది బెంగళూరు. తాజాగా అతడు మొదటి మ్యాచ్‌లోనే సత్తాచాటడం వల్ల అతడి మాజీ జట్టుకు ఓ సందేశం పంపింది ఆర్సీబీ.
"ఆర్సీబీ తరఫున మొదటి సిక్సు. ఆ బంతి చెన్నై అవతల పడింది. థ్యాంక్యూ పంజాబ్ కింగ్స్. ఒకవేళ భౌతిక దూరం లేకుంటే మిమ్మల్ని కౌగిలించుకునే వాళ్లం" అంటూ పోస్ట్ చేసింది బెంగళూరు.
దీనికి కౌంటర్ ఇచ్చింది పంజాబ్. "హా థ్యాంక్యూ గేల్, రాహుల్, మన్దీప్, సర్ఫరాజ్, మయాంక్ అగర్వాల్‌లను ఇచ్చినందుకు" అంటూ ట్వీట్ చేసింది.
-
Aww and thank you for Gayle, KL, Mandy, Sarfaraz, Mayank... 🤗#SaddaPunjab #IPL2021 #PunjabKings
— Punjab Kings (@PunjabKingsIPL) April 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Aww and thank you for Gayle, KL, Mandy, Sarfaraz, Mayank... 🤗#SaddaPunjab #IPL2021 #PunjabKings
— Punjab Kings (@PunjabKingsIPL) April 9, 2021Aww and thank you for Gayle, KL, Mandy, Sarfaraz, Mayank... 🤗#SaddaPunjab #IPL2021 #PunjabKings
— Punjab Kings (@PunjabKingsIPL) April 9, 2021
ప్రారంభంలో ఆర్సీబీకి ఆడిన గేల్, రాహుల్, మన్దీప్, సర్ఫరాజ్, మయాంక్ ప్రస్తుతం పంజాబ్ జట్టులో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేసింది ఫ్రాంచైజీ.
ఆ తర్వాత మరో ఫన్నీ కౌంటర్‌తో పంజాబ్‌కు సమాధానమిచ్చింది ఆర్సీబీ. "మీరు జెర్సీ, ప్యాడ్స్, లోగో మిస్ అయ్యారు" అంటూ పోస్ట్ చేసింది. ఈ సీజన్ కోసం ఇటీవల కొత్త జెర్సీని రూపొందించింది పంజాబ్ యాజమాన్యం. ఈ జెర్సీ ప్రారంభంలో ఆర్సీబీ ధరించిన జెర్సీని పోలి ఉంది. దీంతో ఈ ట్వీట్ వేసింది రాయల్ ఛాలెంజర్స్.
-
You missed jersey, helmet, pads...and logo?
— Royal Challengers Bangalore (@RCBTweets) April 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
But between us, who's keeping count?🤷♂😉#PlayBold #WeAreChallengers #MIvRCB #DareToDream
">You missed jersey, helmet, pads...and logo?
— Royal Challengers Bangalore (@RCBTweets) April 9, 2021
But between us, who's keeping count?🤷♂😉#PlayBold #WeAreChallengers #MIvRCB #DareToDreamYou missed jersey, helmet, pads...and logo?
— Royal Challengers Bangalore (@RCBTweets) April 9, 2021
But between us, who's keeping count?🤷♂😉#PlayBold #WeAreChallengers #MIvRCB #DareToDream