ETV Bharat / sports

గొప్ప క్రికెట్ పరిజ్ఞానం సంజు సొంతం: మోరిస్

రాజస్థాన్ రాయల్స్​ కెప్టెన్ సంజు శాంసన్​పై ప్రశంసలు కురిపించాడు దక్షిణాఫ్రికా క్రికెటర్​ క్రిస్ మోరిస్. అతడిలో మంచి క్రికెట్​ పరిజ్ఞానం ఉందని వెల్లడించాడు. అతడిని యువ కెప్టెన్​గా కాకుండా అనుభవజ్ఞుడైన ఆటగాడిగా చూడాలని తెలిపాడు.

IPL 2021: Don't see Sanju a young captain, he's got a great cricket brain, says Morris
గొప్ప క్రికెట్ పరిజ్ఞానం సంజు సొంతం: మోరిస్
author img

By

Published : Mar 31, 2021, 5:31 AM IST

రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్ సంజు శాంసన్​కు గొప్ప క్రికెట్​ పరిజ్ఞానముందని వెల్లడించాడు దక్షిణాఫ్రికా ఆల్​రౌండర్​ క్రిస్ మోరిస్. అతడిని యువ కెప్టెన్​గా మాత్రమే పరిగణించవద్దని.. అతడిలో ఓ సీరియస్ క్రికెటర్​ ఉన్నాడని తెలిపాడు.

"నేను సంజుతో కలిసి రాజస్థాన్​, దిల్లీ జట్ల తరఫున ఆడాను. అతడితో నాకు సన్నిహిత సంబంధం ఉంది. సంజుతో కలిసి చాలా సార్లు బ్యాటింగ్ చేశాను. అతడిలో యువ కెప్టెన్​ను చూడలేదు. మంచి పరిణితి గల క్రికెటర్​ను చూశాను. సంజుకు గొప్ప క్రికెట్​ పరిజ్ఞానం ఉంది" అని క్రిస్ మోరిస్ తెలిపాడు.

ఆటలో ఏవైనా చిట్కాలు అవసరమైన సమయంలో సంజును సంప్రదించడానికి ఏమాత్రం వెనుకాడబోనని మోరిస్ అన్నాడు. "శాంసన్​ ఆట గురించి తీవ్రంగా ఆలోచించే వ్యక్తి. అతని సారథ్యంలో ఆడటానికి ఎదురుచూస్తున్నా. ఆటలో అతడికి వంద శాతం మద్దతిస్తాను. ఇది అద్భుతమైన టోర్నమెంట్ అవుతుందని నేను భావిస్తున్నాను" అని మోరిస్ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: హీరోయిజానికి అసలైన అర్థం అతడే: ఆనంద్​ మహీంద్రా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.