ETV Bharat / sports

టిక్​టాక్ స్టార్ వార్నర్​ను ట్రోల్ చేసిన రోహిత్ శర్మ!

ఐపీఎల్​లో ఆడేందుకు ఇండియా చేరుకున్న ఆసీస్ స్టార్ బ్యాట్స్​మెన్​ డేవిడ్ వార్నర్​.. క్వారంటైన్​ సమయాన్ని గడపడానికి ఏవైనా ఐడియాలు ఉంటే సూచించాలని అభిమానులను కోరాడు. దీనిపై స్పందించిన రోహిత్ శర్మ.. టిక్​టాక్​ను మిస్సవుతున్నాననే హాస్యభరిత కామెంట్ చేశాడు.

IPL 2021: David Warner asks fans for ideas to kill time in quarantine
'క్వారంటైన్​ను ఎలా కరిగించేయాలో చెప్పండి'
author img

By

Published : Apr 3, 2021, 1:56 PM IST

Updated : Apr 3, 2021, 3:12 PM IST

క్వారంటైన్​లో కాలక్షేపం కోసం ఐడియాలు ఇవ్వాలంటూ అభిమానులను కోరాడు సన్​రైజర్స్​ కెప్టెన్ డేవిడ్ వార్నర్​. ఐపీఎల్​లో భాగంగా శుక్రవారం చెన్నైకి చేరుకున్నాడు ఈ ఆస్ట్రేలియా ఆటగాడు.

"చెన్నైకి చేరుకున్నాను. కానీ, ఒక సమస్య ఉంది. రానున్న వారం రోజులు క్వారంటైన్​లో ఉండాల్సి ఉంది. కాలక్షేపం కోసం ఏమి చేయాలో సూచించండి. దయచేసి కామెంట్ చేయండి" అని ఇన్​స్టా వేదికగా అభిమానులను కోరాడు వార్నర్. ఈ క్రమంలో స్టార్ క్రికెటర్​ రోహిత్ శర్మ.. టిక్​టాక్​ను బాగా మిస్సవుతున్నానని కామెంట్ చేశాడు.

కొవిడ్ నిబంధనల్లో భాగంగా ప్రతి క్రికెటర్​కు ఏడు రోజుల క్వారంటైన్​ తప్పనిసరి చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 11న తమ తొలి మ్యాచ్​ కోల్​కతాతో ఆడనుంది హైదరాబాద్​.

భార్యకు ప్రేమతో..

"కొన్ని నెలల వరకు ఇదే మన చివరి వైన్​. ఇంటి దగ్గర కొంత సమయం గడిపాను. కానీ, ఇది ఇండియాకు వెళ్లాల్సిన సమయం. లవ్​ యూ లాట్స్​ డార్లింగ్"​ అంటూ వార్నర్​ తన భార్యను ఉద్దేశిస్తూ పోస్టు చేశాడు.

ఇదీ చదవండి: కోహ్లీ, ఆమ్లా రికార్డును బ్రేక్​ చేసిన బాబర్​

Last Updated : Apr 3, 2021, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.