ETV Bharat / sports

ఐపీఎల్​ను వీడని కరోనా.. ఆర్సీబీ ఆటగాడికి పాజిటివ్ - డేనియల్ సామ్స్​కు కరోనా

రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు డేనియల్ సామ్స్ కరోనా బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ప్రకటించింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో ఉన్నట్లు వెల్లడించింది.

Daniel Sams
డేనియల్ సామ్స్
author img

By

Published : Apr 7, 2021, 11:06 AM IST

ఐపీఎల్​ను కరోనా కలవరం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు కరోనా సోకగా.. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు డేనియల్ సామ్స్ వైరస్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. డాక్టర్ల అధ్వర్యంలో అతడు ఐసోలేషన్​లో ఉన్నట్లు వెల్లడించింది.

"ఏప్రిల్ 7న చేసిన రెండో టెస్టులో డేనియల్ సామ్స్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం అతడికి లక్షణాలు ఏమీ లేవు. డాక్టర్ల పర్యవేక్షణలో ఐసోలేషన్​లో ఉన్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడికి ఆర్సీబీ డాక్టర్లు చికిత్స అందిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తారు."

-ఆర్సీబీ ఫ్రాంచైజీ

ఈ సీజన్​లో జరిగే మొదటి మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ ఏప్రిల్ 9న రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.