ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు ఒకే ప్రాంతంలో కాకుండా నాలుగైదు ప్రాంతాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సీనియర్ అధికారులు చర్చలు జరిపినట్లు బీసీసీఐ అధికారి వెల్లడించారు.
"ప్రణాళిక ప్రకారం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ప్రయత్నిస్తున్నాం. పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో అభిమానులకు మరింత చేరువయ్యేందుకే ఈ ప్రయత్నం. బయోబబుల్ ఏర్పాట్ల దృష్ట్యా మ్యాచ్ నిర్వహించే వేదికలను ఖరారు చేస్తాం. ఆటగాళ్ల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది."
-బీసీసీఐ అధికారి.
ఐపీఎల్ 14 సీజన్‌ను ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి:అక్షర్ అద్భుత ప్రదర్శన.. అచ్చం జడ్డూలానే