ETV Bharat / sports

ఐపీఎల్​ వేలం: ఈ బౌలర్లు, ఆల్​రౌండర్లపైనే దృష్టి!

ఫిబ్రవరి 18న ఎనిమిది ఫ్రాంచైజీల మధ్య ఆసక్తికరంగా ఐపీఎల్​ వేలం జరగనుంది. మొత్తం 292 మంది ఆటగాళ్లు పాల్గొనే ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉన్న బౌలర్లు, ప్రధాన ఆకర్షణగా నిలిచే ఆల్​రౌండర్లు ఎవరనేది ఓ సారి చూద్దాం.

IPL 2021 Auction: Maxwell, Morris, Shakib among hottest picks in all-rounder category
రేపే ఐపీఎల్ వేలం​- ప్రధాన ఆకర్షణ వీరిపైనే!
author img

By

Published : Feb 17, 2021, 9:20 PM IST

Updated : Feb 17, 2021, 10:20 PM IST

ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్​ వేలంలో మొత్తం 292 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. వీరిలో 164 మంది భారత ఆటగాళ్లు కాగా 125 మంది విదేశీ ప్లేయర్లు. మరో ముగ్గురు అసోసియేట్​ నేషన్స్​ క్రీడాకారులు ఉన్నారు.

మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలలో అత్యధికంగా బెంగళూరుకు 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉండగా.. సన్​రైజర్స్​ హైదరాబాద్​కు అత్యల్పంగా ముగ్గురిని తీసుకునే ఛాన్స్​ ఉంది. అయితే వీరందరిలో గురువారం జరిగే వేలానికి ప్రధాన ఆకర్షణగా ఉన్న బౌలర్లు, ఆల్​రౌండర్లు ఎవరో ఓ సారి చూద్దామా..

ఫ్రాంచైజీలు గురిపెట్టే బౌలర్లు..

1. టిమ్​ సౌథీ:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో ఏడో స్థానంలో ఉన్న ఈ ఫాస్ట్​ బౌలర్​.. న్యూజిలాండ్ తరఫున 87 వికెట్లు తీశాడు. ఇటీవల పాకిస్థాన్​తో జరిగిన పొట్టి సిరీస్​లో తొలి మ్యాచ్​లో రెండు వికెట్లు తీయగా.. రెండో టీ20లో నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రూ.75 లక్షల బేస్​ ప్రైస్​తో ఉన్న సౌథీ.. రేపటి వేలంలో అందరిలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తానడంలో ఎటువంటి సందేహం లేదు.

2. హర్భజన్​ సింగ్​:

వ్యక్తిగత కారణాలతో 2020 ఐపీఎల్​ సీజన్​కు దూరంగా ఉన్న ఈ భారత మాజీ స్పిన్నర్​ను.. ఇటీవలే చెన్నై ఫ్రాంచైజీ తమ జట్టు నుంచి తప్పించింది. ఇప్పటివరకు ఐపీఎల్​లో 160 మ్యాచ్​లాడిన భజ్జీ.. 150 వికెట్లు తీశాడు. రూ.2 కోట్ల బేస్​ ప్రైస్​తో ఉన్న హర్భజన్​ వేలంలో మంచి ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంది.

3. ముజీబ్​ ఉర్​ రెహ్మాన్​:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో 3వ స్థానంలో ఉన్న ఈ అఫ్గాన్​ బౌలర్​.. రూ.1.5 కోట్ల బేస్​ ప్రైస్​తో ఉన్నాడు. గతంలో పంజాబ్​ జట్టుకు ఆడిన రెహ్మాన్​కు.. ఇటీవలే ఆ ఫ్రాంచైజీ ఉద్వాసన పలికింది. అఫ్గాన్​ తరఫున 19 టీ20లు ఆడిన ముజీబ్​.. 25 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

4. ఉమేశ్​ యాదవ్:

కోటి రూపాయల బేస్​ ప్రైస్​తో ఉన్న ఉమేశ్​.. మొత్తం ఐపీఎల్​లో 121 మ్యాచ్​లాడి 119 వికెట్లు తీసుకున్నాడు. 2018 సీజన్​లో కేవలం 14 టీ20ల్లోనే 20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఆర్సీబీ జట్టుకు ఆడిన ఉమేశ్​.. ఈ సారి వేలంలో ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యే అవకాశం ఉంది.

5. షెల్డాన్​ కాట్రెల్​:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో 8వ స్థానంలో ఉన్నాడు ఈ విండీస్​ బౌలర్​. గతంలో పంజాబ్​ జట్టు తరఫున ఆడిన కాట్రెల్.. కోటి రూపాయల బేస్​ ప్రైస్​తో ఉన్నాడు.

ప్రధాన ఆకర్షణగా నిలిచే ఆల్​రౌండర్లు..

1. గ్లెన్​ మాక్స్​వెల్​:

గత సీజన్​లో ఘోరంగా విఫలమైన ఈ ఆసీస్​ ఆల్​రౌండర్​ను.. తాజాగా పంజాబ్​ ఫ్రాంచైజీ వదులుకుంది. 13వ సీజన్​లో 13 మ్యాచ్​లాడిన మాక్స్​.. కనీసం ఒక్క సిక్సర్​ కూడా కొట్టలేకపోయాడు. ఐసీసీ టీ20 ఆల్​రౌండర్ల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న మాక్స్​వెల్​.. తనదైన రోజున మ్యాచ్​ను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన బిగ్​బాష్​ లీగ్​తో తిరిగి ఫామ్​ను అందిపుచ్చుకున్న ఈ ఆల్​రౌండర్​ తాజా వేలంలో రూ.2 కోట్ల బేస్​ ప్రైస్​తో ఉన్నాడు.

2. క్రిస్​ మోరిస్​:

బంతితోను, బ్యాట్​తోనూ సత్తా చాటే ఈ సౌతాఫ్రికా ప్లేయర్​.. ప్రస్తుతం రూ.75 లక్షల విలువ జాబితాలో ఉన్నాడు. గత సీజన్​లో ఆర్సీబీ జట్టుకు ఆడిన క్రిస్​.. 9 మ్యాచ్​లాడి 11 వికెట్లు దక్కించుకున్నాడు. అయితే ఆ సీజన్​లో బ్యాటింగ్​లో తగిన అవకాశాలు రాలేదు. దీంతో కేవలం 24 రన్స్​ మాత్రమే చేశాడు.

3. షకిబుల్​ హసన్​:

ఐసీసీ వన్డే ఆల్​రౌండర్ల జాబితాలో తొలి స్థానంతో పాటు టీ20 ఆల్​రౌండర్ల లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు షకిబ్​. రూ.2 కోట్ల విలువ జాబితాలో ఉన్న ఈ బంగ్లాదేశ్​ క్రికెటర్​.. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్​ చేయగలడు. అటు బ్యాటుతోనూ తనదైన శైలిలో రెచ్చిపోయే షకిబ్​.. జట్టుకు ఉపయుక్తమైన పరుగులు సాధించగలడు.

4. మొయిన్​ అలీ:

ఆర్సీబీ తరఫున 13వ సీజన్​ ఆడిన ఈ స్పిన్​ ఆల్​రౌండర్​.. ప్రస్తుతం రూ.2 కోట్ల బేస్​ ప్రైస్ జాబితాలో ఉన్నాడు. ఇంగ్లాండ్​ జట్టులో 140 పరిమిత ఓవర్ల క్రికెట్​ మ్యాచ్​లు ఆడిన అనుభవం అలీ సొంతం. ఇటీవల భారత్​తో టెస్టు మ్యాచ్​లో 8 వికెట్లు సాధించి తన సత్తా ఎంటో నిరూపించాడు.

5. షారుక్ ఖాన్:

ఇటీవల సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చాడు ఈ తమిళనాడు ఆల్​రౌండర్​.​​ క్వార్టర్ ఫైనల్లో 19 బంతుల్లోనే 40 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. బ్యాటింగ్​తో పాటు పేస్​ బౌలింగ్​ కూడా చేయగల షారుక్​.. రూ.20 లక్షల బేస్​ ప్రైస్​ లిస్టులో ఉన్నాడు. ఇప్పటివరకు 31 టీ20లు ఆడిన ఈ ఆటగాడు 293 పరుగులు సాధించాడు.

ఇదీ చదవండి: తొలి టీ20 మ్యాచ్ ఆడింది ఈరోజే

Last Updated : Feb 17, 2021, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.