ETV Bharat / sports

ఆర్చర్​ మోచేతికి సర్జరీ.. ఈసీబీ స్పష్టం - జోఫ్రా ఆర్చర్​

మోచేతి గాయంతో బాధపడుతున్న ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​కు శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయం కారణంగా భారత్​తో వన్డే సిరీస్​తో పాటు ఐపీఎల్​కు కూడా దూరమయ్యాడు ఆర్చర్​.

IPL 2021: Archer to undergo surgery to manage injury in long term, says ECB
జోఫ్రా ఆర్చర్​, మోచేతి గాయం పాలైన ఇంగ్లాండ్ స్టార్​ ఆల్​రౌండర్​
author img

By

Published : Mar 27, 2021, 7:24 PM IST

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ మోచేతికి శస్త్ర చికిత్స నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు(ఈసీబీ) స్పష్టం చేసింది. వన్డే సిరీస్​కు ముందు ఇంజెక్షన్​ తీసుకున్నప్పటికీ.. గాయం తీవ్రతలో మార్పు రాలేదని పేర్కొంది.

దీంతో ప్రస్తుత వన్డే సిరీస్​తో పాటు ఐపీఎల్​కు కూడా ఆర్చర్​ దూరమయ్యాడు.

"భారత్​తో పర్యటనకు ముందు తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఆర్చర్​ గాయపడ్డాడు. పర్యటనలో భాగంగా ఈసీబీ వైద్య బృందం ఈ గాయాన్ని గుర్తించింది. గాయం మొదట్లో అతడి ఆటపై ప్రభావం చూపలేదు. సిరీస్​ మధ్యలో అది ఆర్చర్​ను ఇబ్బంది పెట్టింది. దీనికి శస్త్ర చికిత్స చేయించడమే ఉత్తమం," అని ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఇదీ చదవండి: ఓర్లీన్​ మాస్టర్స్​ ఫైనల్స్​కు​ భారత పురుషుల​ జోడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.