కరోనా ప్రభావంతో ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహణపై బెంగళూరు జట్టు కెప్టెన్ కోహ్లీ మరోసారి మాట్లాడాడు. స్టాండ్స్‌లో అభిమానులు లేనంత మాత్రాన తమ జట్టులోని ఆటగాళ్లలో జోరు తగ్గదన్నాడు. మునుపటిలానే పోటీతత్వంతో ఆడతామని స్పష్టం చేశాడు.
ఆర్సీబీ ఛైర్మన్ సంజీవ్ చురీవాలా, కోహ్లీ, పార్థివ్ పటేల్, దేవదత్ పడిక్కల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వీరులకు గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలు విషయాల్ని చెప్పాడు విరాట్.
"బయో బబుల్ వాతావరణానికి మేం అలవాటుపడ్డాం. ఇలా ఆడుతున్నందుకు మాకు బాధగా ఏమీ లేదు. ఇప్పటివరకు కరోనా నుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకున్నాం" అని కోహ్లీ చెప్పాడు.
![Kohli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8784908_copy-of-copy-of-mayank-agarwal-8_1409newsroom_1600081884_164_1709newsroom_1600338380_695.jpg)
"ట్రైనింగ్ సెషన్లో అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ ప్రస్తుత పరిస్థితులను అలవాటు చేసుకున్నాం. ఈ ఐపీఎల్‌తో ప్రతిఒక్కరి ముఖాలపై చిరునవ్వులు చూడాలని ఆశిస్తున్నాం" అని వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్ చెప్పాడు.
సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ప్రస్తుత సీజన్ జరగనుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది. సెప్టెంబరు 21న హైదరాబాద్‌తో ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.
ఇదీ చూడండి గంగూలీ బయోపిక్‌లో హృతిక్.. కానీ ఒక్క షరతు