ETV Bharat / sports

'లాక్​డౌన్​లో కోహ్లీ ఫిట్​నెస్​ మరింత మెరుగైంది' - virat kohli news

లాక్​డౌన్​ సమయంలో విరాట్​ కోహ్లీ తన ఫిట్​నెస్​ను మరింత మెరుగుపర్చుకున్నాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫిట్​నెస్​ ట్రైనర్​ శంకర్​ బసూ అన్నారు. ఫిట్​నెస్ విషయంలో విరాట్​ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తాడని పేర్కొన్నారు.

Virat Kohli
విరాట్​ కోహ్లీ
author img

By

Published : Sep 6, 2020, 6:08 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఫిట్​నెస్​పై రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు ఫిట్​నెస్​ ట్రైనర్​ శంకర్​ బసూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లాక్​డౌన్​ సమయంలో కోహ్లీ మరింత శారీరక దృఢత్వాన్ని సంపాదించాడని పేర్కొన్నారు. ​ అంతర్జాతీయ స్థాయిలో సాధ్యం కాని విషయాలను విరాట్​ చేసి చూపిస్తాడని అన్నారు.

కోహ్లీ ముంబయిలోని తన నివాసంలో లాక్​డౌన్​ సమయాన్ని గడిపాడు. క్రమం తప్పకుడా వ్యాయామం చేస్తూ.. తన ఫిట్​నెస్​పై దృష్టి సారించాడు. అందుకు సంబంధించిన వీడియోలనూ ఇన్​స్టాగ్రామ్​లో అభిమానులతో పంచుకున్నాడు.

"ఫిట్​నెస్​ పరంగా విరాట్​ మరింత మెరుగైన స్థితిలో తిరిగి వచ్చాడు. ప్రస్తుతం అతని ప్రదర్శన గతంలో కంటే బాగుంది. ఈ విరామ సమయాన్ని శారీరక దృఢత్వం పెంపొందించుకునేందుకు కోహ్లీ మంచిగా ఉపయోగించుకున్నాడు. అతని ఆహారపు అలవాట్లను నియంత్రణలో ఉంచుకున్నాడు."

-శంకర్​ బసూ, ఆర్సీబీ ఫిట్​నెస్​ ట్రైనర్​

కాగా యూఏఈలో వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని.. పేస్ బౌలింగ్​ తీరుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని బసూ తెలిపారు. ఆర్సీబీ జట్టులో భారత బౌలర్లు ఉమేశ్​ యాదవ్​, నవ్​దీప్​ సైనీ, మహ్మద్​ సిరాజ్​లు ఉన్నారు. సరైన డైట్​, ఫిట్​నెస్​పై వారు శ్రద్ధ వహిస్తే.. ఈ సారి ట్రోఫీ ఆర్సీబీకే దక్కే అవకాశం ఉందని బసూ ఆశాభావం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.