ETV Bharat / sports

క్వారంటైన్​ చాలా కష్టంగా గడిచింది : ధోనీ - quarantine dhoni

ఆరు రోజుల క్వారంటైన్​ చాలా కష్టంగా గడిచిందని చెప్పిన ధోనీ.. దుబాయ్​ వాతావరణానికి బాగానే అలవాటుపడినట్లు వెల్లడించాడు.

MSD
ధోనీ
author img

By

Published : Sep 19, 2020, 10:03 PM IST

దుబాయ్​లో అడుగుపెట్టిన తర్వాత ఉన్న ఆరురోజుల క్వారంటైన్ సమయం ఎంతో కష్టంగా గడిచిందని చెప్పాడు చెన్నై సూపర్​కింగ్స్ కెప్టెన్ ధోనీ. లాక్​డౌన్​లో ఐదు నెలలు కుటుంబసభ్యులతో గడిపిన అనంతరం ఒంటరిగా ఉండటం భారంగా అనిపించిందని అన్నాడు. ముంబయితో మ్యాచ్​ ప్రారంభానికి ముందు ఈ వ్యాఖ్యలు చేశాడు.

"ఆరు రోజులపాటు క్వారంటైన్​లో ఉండటం చాలా కష్టంగా అనిపించింది. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతూ అకస్మాతుగా ఒక్క గదిలో ఒంటరిగా ఉండటం మాములు విషయం కాదు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇటీవల ప్రాక్టీసు కూడా బాగా చేశాం. ఇక్కడి వాతావరణానికి బాగానే అలవాటు పడ్డాం"

-ధోనీ, సీఎస్కే కెప్టెన్

గత సీజన్​ ఫైనల్​లో ముంబయిపై ఓడిపోయారు కదా, ఈ సీజన్​లో దానికి ప్రతికారం తీర్చుకుంటారా? అని అడగ్గా.. "జెంటిల్​మెన్​ ప్రతీకారం గురించి ఆలోచించడు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడంపై దృష్టి సారిస్తాడు" అని ధోనీ అన్నాడు.

MSD
ధోనీ

టాస్​ ఓడి తొలుత బ్యాటింగ్​ దిగిన ముంబయి జట్టు.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. డికాక్ (33), సౌరభ్ తివారీ (42) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిగిలిన వారు నామమాత్రంగా పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఎంగిడి 3, జడేజా, దీపక్ చాహర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇదీ చూడండి చెన్నై సూపర్​కింగ్స్ లక్ష్యం 163 పరుగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.