ETV Bharat / sports

మలింగ లేని లోటును పూడ్చలేం : రోహిత్​

మలింగ ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​కు అందుబాటులో లేకపోవడం బాధగా ఉందన్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జట్టును విజయం దిశగా నడిపించాడని గుర్తు చేసుకున్నాడు.

Rohit
రోహిత్​
author img

By

Published : Sep 17, 2020, 8:43 PM IST

ముంబయి ఇండియన్స్ సీనియర్ బౌలర్​ లసిత్​ మలింగ సేవలు కోల్పోవడం చాలా బాధగా ఉందని చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టుకు అతడు ఎన్నో విజయాలు అందిచాడని గుర్తు చేసుకున్నాడు. ఈ ఏడాది తమతో కలిసి ఆడకపోవడం దురదృష్టమని పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణలతో ఈ సీజన్​కు మలింగ దూరమయ్యాడు.​

"మలింగ, ముంబయి ఇండియన్స్​ మ్యాచ్​ విన్నర్​. జట్టుకు చాలా ఏళ్లపాటు సేవలందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి అందులో నుంచి బయటపడేశాడు. ఈ సీజన్​లో అతడు లేకపోవడం చాలా బాధగా ఉంది. అతడి స్థానాన్ని భర్తీ చేయడానికి జేమ్స్​ ప్యాటిన్సన్, ధవల్ కుల్​కర్ణితో పాలు పలువురిని పరిశీలిస్తున్నాం. కానీ అది అంత సులువైన పని కాదు"

-రోహిత్​, ముంబయి ఇండియన్స్​ సారథి

ఐపీఎల్​ చరిత్రలో ఇతర ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా నాలుగుసార్లు విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్. ఈ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు మలింగ. లీగ్​ చరిత్రలోనే 170 వికెట్లు తీసి బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

బయో బబుల్​ వాతావరణానికి తాను బాగానే అలవాటు పడినట్లు రోహిత్ చెప్పాడు​. ఈ సీజన్​లో గెలుపే లక్ష్యంగా తమ జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని తెలిపాడు. సెప్టెంబరు 19న జరిగే ప్రారంభ మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​తో తలపడనుంది ముంబయి.

ఇదీ చూడండి ధోనీకి బంగారు టోపీ.. జడేజాకు కత్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.