ETV Bharat / sports

ఐపీఎల్​ బుడగను 'బిగ్​బాస్'​ హౌస్​తో పోల్చిన ధావన్​ - ఐపీఎల్​ వార్తలు

కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్​ను బయోబబుల్​ వాతావరణంలో నిర్వహించనున్నారు. అయితే, బయో సెక్యూర్​లో నివసించడం.. బిగ్​బాస్​ హౌస్​తో సమానమని అన్నాడు దిల్లీ క్యాపిటల్స్​ ఓపెనర్​ శిఖర్​ ధావన్​. ​

Shikhar
ధావన్​
author img

By

Published : Sep 16, 2020, 10:04 PM IST

ఐపీఎల్​లో బయో సెక్యూర్​ విధానాన్ని బిగ్​బాస్​ హౌస్​తో పోల్చాడు దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్​ శిఖర్​ ధావన్​. అయితే, క్రికెటర్​గా ప్రతి అంశంలో మెరుగయ్యేందుకు ఇదొక మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. బుధవారం ఓ మీడియాకు ఇచ్చిన ఆన్​లైన్​ ఇంటర్వ్యూలో.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ధావన్​.

కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్​ను యూఏఈ వేదికగా బయో సెక్యూర్​ పద్దతిలో నిర్వహించనున్నారు. భారత్​లో కాకుండా.. ఈ విధంగా విదేశాల్లో లీగ్​ను జరపడం మూడోసారి.

"బయో బబుల్​ ప్రతి ఒక్కరికీ కొత్తగానే ఉంది. ఎంతో కఠినమైనది కూడా. అయితే, క్రికెటర్​గా మెరుగయ్యేందుకు మంచి అవకాశంగా నేను భావిస్తున్నా. కచ్చితంగా ఎప్పటికీ నేను వినోదానికి దగ్గరగా ఉంటా. పరిస్థితులను సానుకూల పద్దతిలోనూ చూస్తా. ఈ బుడగలో మానసిక దృఢత్వాన్ని పరీక్షించుకోవడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు బిగ్​బాస్​ హౌస్​ లాంటిదే."

-- శిఖర్​ ధావన్​, దిల్లీ క్యాపిటల్స్​ క్రికెటర్​

ఆటను మెరుగుపరుచుకోవడమే కాకుండా భిన్నమైన బ్యాటింగ్​ శైలి కోసం లాక్​డౌన్​ సమయాన్ని ఉపయోగించుకున్నట్లు ధావన్​ తెలిపాడు. ఐదునెలల సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి క్రికెట్​ ఆడటమంటే.. మానసికంగా పెద్ద సవాలని పేర్కొన్నాడు. ఈసారి ఎలాగైనా దిల్లీ జట్టు ఐపీఎల్​ ట్రోఫీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.