ETV Bharat / sports

ఐపీఎల్​ : అద్భుతంగా మెరిశారు.. అంతలోనే తుస్సుమనిపించారు - టాప్​ 5 సూపర్ రికార్డులు

ఐపీఎల్​లో కల్లు చెదిరే గణాంకాలతో అద్భుతాలను సృష్టించి, జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించి.. అనంతరం ఫామ్ లేమితో కనుమరుగైపోయిన కొందరు క్రికెటర్ల గురించి ఈ ప్రత్యేక కథనం.

ipl
ఐపీఎల్
author img

By

Published : Sep 14, 2020, 9:45 AM IST

ఐపీఎల్​.. ఏ ఆటగాడైనా తన ప్రతిభను నిరూపించుకోవడానికి చక్కని వేదిక. ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో సహా అన్ని దేశాల క్రికెటర్లు ఈ మెగాలీగ్​ కోసం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తుంటారు. 2008లో ప్రారంభమైన ఈ టోర్నీ ద్వారానే రవిచంద్రన్​ అశ్విన్​, జస్ప్రీత్​ బుమ్రా సహా ఎంతోమంది స్టార్​ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. మైదానంలో చెలరేగిపోతున్నారు.

అయితే కొందరు మాత్రం ఒక్క సీజన్​తోనే ఆకాశమంతా స్టార్​డమ్​ సంపాదించుకున్నారు. బరిలో దిగితే ఆట రూపురేఖలే మార్చేస్తారనేలా కీర్తి గడించారు. దీంతో తర్వాతి సీజన్​ల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూడటం ప్రారంభించారు. కానీ వారు మాత్రం పేలవ ప్రదర్శనతో వీక్షకులకు నిరాశను మిగిల్చారు. కొందరైతే ఏకంగా కనుమరుగైపోయారు. ఇంతకీ వారెవరు? సాధించిన అద్భుతమైన గణాంకాలేంటి?

పాల్​ వల్తాటి

పాల్​ వల్తాటి.. 2011లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​కు ఆడాడు. ఆ ఏడాది 35.61 స్ట్రైక్​రేట్​తో 14 మ్యాచుల్లో 463 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 120. ఎవరు ఊహించని విధంగా సీఎస్కేపై 63 బంతుల్లోనే 120 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా రికార్డు సాధించాడు. కానీ ఆ జోరును తదుపరి సీజన్​లో కొనసాగించలేకపోయాడు. 2012లో కేవలం ఆరు మ్యాచులు ఆడగా.. 2013లో ఒక్కటి ఆడాడు. ప్రస్తుతం ఎయిర్​ ఇండియా తరఫున ఆడుతున్నాడు.

paul
పాల్​ వల్తాటీ

రాహుల్​ శర్మ

యువ స్పిన్నర్​ రాహుల్​ శర్మ(డెక్కన్​ ఛార్జర్స్​)ను అందరూ​ అశ్విన్​తో పోల్చేవారు. 2011 సీజన్​లో సచిన్ వికెట్ తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే ఏడాది 17.06 స్ట్రైక్​రేట్​తో 14 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి జాతీయ జట్టులో చోటు లభించింది. నాలుగు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు.

కానీ అనుకోని రీతిలో మాదక ద్రవ్యాలు సేవించి జాతీయ జట్టులో నిషేధానికి గురయ్యాడు. చివరగా 2012లో శ్రీలంకతో జరిగిన సిరీస్​లో పాల్గొన్నాడు. ప్రస్తుతం పంజాబ్​లోని అంతర్​ జిల్లా మధ్య జరిగే మ్యాచులు ఆడుతున్నాడు. పంజాబ్​ తరఫున దేశవాళీ క్రికెట్​లో పునరాగమనం చేయాలని యోచిస్తున్నాడు.

rahul
రాహుల్​ శర్మ

స్వప్నిల్​ అశ్నోడ్కర్​

2008 ఐపీఎల్​.. తొలి ఏడాదే టైటిల్​ను ఎగరేసుకుపోయింది రాజస్థాన్​ రాయల్స్​. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు స్వప్నిల్​ అశ్నోడ్కర్​. తొమ్మిది మ్యాచుల్లో 311 పరుగులు చేసి ఔరా అనిపించాడు. గ్రేమ్ స్మిత్​తో కలిసి అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వీరిద్దరూ 59.71 సగటుతో 418 పరుగలు చేశారు. కానీ ఆ తర్వాత ఆడిన సీజన్​లలో పేలవమైన ప్రదర్శనతో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి అభిమానులను డీలా పరిచాడు.

swapnil
స్వప్నిల్​ అశ్నోడ్కర్​

మన్విందర్​ బిస్లా

2012లో కోల్​కతా నైట్ రైడర్స్​ తరఫున ఆడాడు మన్విందర్​ బిస్లా. ఆ సీజన్​లో చైన్నై జట్టుపై చేసిన 89 పరుగులు... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆ ఏడాదే కేకేఆర్​ తొలిసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. దీంతోపాటు 2013లోనూ 30.42స్టైక్​రేట్​తో 14 మ్యాచుల్లో 255 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత అతడి ఆటతీరు సరిగ్గాలేక ఫ్రాంచైజీలు వేలంపాటలో కొనడం కూడా మానేశాయి. అలా ఐపీఎల్​కు దూరమైపోయాడు.

manvinder
మన్విందర్​ బిస్లా

డౌగ్​ బొల్లింగర్

డౌగ్​ బొల్లింగర్ ఐపీఎల్​లో అత్యంత ప్రతిభ గల బౌలర్లలో ఒకడు. 2010లో తొలిసారి చెన్నై సూపర్​కింగ్స్ ట్రోఫీని అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. 2012లోనూ ఇదే జోరు చూపించాడు. మొత్తంగా ఐపీఎల్​లో 27 మ్యాచులాడి 37 వికెట్లు తీశాడు. ఇంతటి అద్భుత గణాంకాలను నమోదు చేసినప్పటికీ.. అనూహ్యంగా జట్టు యాజమాన్యం కొద్దికాలంగా ఇతడిని పక్కన పెట్టేసింది. ​

doug
డౌగ్​ బొల్లింగర్

ఇదీ చూడండి నిషేధం పూర్తయింది.. ఇక ఆటకు రెడీ: శ్రీశాంత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.