ETV Bharat / sports

ఐపీఎల్​లో మరోసారి కరోనా కలకలం - IPL CSK CORONA'

దుబాయ్​లో ఉన్న తమ వైద్యబృందంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్​గా​ తేలిందని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది.

IPL 13: Senior BCCI medical team member tests positive for COVID-19
ఐపీఎల్​లో మరోసారి కరోనా కలకలం
author img

By

Published : Sep 3, 2020, 11:12 AM IST

ఐపీఎల్​లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. లీగ్​ కోసం దుబాయ్​ వెళ్లిన బీసీసీఐ వైద్యబృందంలో ఓ వ్యక్తికి వైరస్​ సోకింది. ఈ విషయాన్ని బోర్డు ధ్రువీకరించింది. దీనితోపాటే బెంగళూరులోని జాతీయ క్రికెట్​ అకాడమీలోనూ ఇద్దరికి పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించింది. వారి పేర్లను మాత్రం బహిర్గతపరచలేదు.

IPL CORONA
ఐపీఎల్-కరోనా పాజిటివ్

"బీసీసీఐ వైద్యబృందంలోని వ్యక్తికి కరోనా వచ్చింది వాస్తవమే. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్​లో ఉన్నారు. తర్వాతి టెస్ట్​కు కోలుకుంటారని అనుకుంటున్నాం. ఎన్​సీఏలో పాజిటివ్​ వచ్చిన ఇద్దరిని ఐసోలేషన్​లో ఉంచాం" -భారత క్రికెట్ బోర్డు

అంతకుముందు ఆగస్టు 29న, అన్ని ఫ్రాంఛైజీలకు చేసిన వైద్యపరీక్షల్లో 13 మంది కరోనా పాజిటివ్​గా తేలిందని బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ఇద్దరు క్రికెటర్లు ఉన్నట్లు చెప్పింది. వారందరిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించింది.

ప్రస్తుత సీజన్​ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు జరగనుంది. దుబాయ్, అబుదాబీ, షార్జా మైదానాలు ఇందుకు ఆతిథ్యమివ్వనున్నాయి.

IPL 13: Senior BCCI medical team member tests positive
దుబాయ్ క్రికెట్ మైదానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.