భారత్-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఆడుతున్న పలువురు క్రికెటర్లు గాయాలపాలవుతున్నారు. దీంతో పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి. సీజన్‌కు వారు అందుబాటులో ఉంటారా? లేదా? భయపడుతున్నాయి.
అసలు ఏమైంది?
పుణెలో మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఈ మ్యాచ్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్.. తర్వాత రెండు వన్డేలకు దూరం కానున్నాడని బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌లోనూ ఇతడు ఆడేది అనుమానంగా కనిపిస్తోంది. ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ మోచేయికి బంతి తగలడం వల్ల ఫీల్డింగ్‌కు రాలేదు. మరి రెండో వన్డేలో హిట్‌మ్యాన్ ఆడతాడో లేదో?
మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ మోర్గాన్‌తో పాటు సామ్ బిల్లింగ్స్ గాయల బారిన పడ్డారు. సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లు వీరిద్దరూ ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
పైన చెప్పిన నలుగురు క్రికెటర్లలో ముగ్గురు ఐపీఎల్ కెప్టెన్లుగా ఉన్నారు. రోహిత్ శర్మ -ముంబయి ఇండియన్స్, శ్రేయస్ అయ్యర్-దిల్లీ క్యాపిటల్స్, మోర్గాన్-కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఒకవేళ వీరు ఐపీఎల్ ఆడకపోతే ఆ జట్లకు ఎవరు సారథ్యం వహిస్తారో మరి?