భారత తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాతగా పేరు గాంచిన చంద్ర నాయుడు మరణించారు. మధ్యప్రదేశ్ ఇందోర్‌కు చెందిన 88 ఏళ్ల చంద్ర.. భారత మాజీ క్రికెటర్ సీకే నాయుడు పెద్ద కుమార్తె.
వయసు సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు చంద్ర సోదరి కుమారుడు విజయ్ నాయుడు వెల్లడించారు.
"ఇందోర్‌లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆమెకు క్రికెట్‌పై అమితమైన ఆసక్తి ఉండేది. 50వ దశకంలోనే ఆమె బ్యాట్ పట్టారు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి మహిళా వ్యాఖ్యాత ఆమె. 80వ దశకంలో ఆమె తల్లి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నీని నిర్వహించారు. మహిళల క్రికెట్ కోసం పరితపించేవారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఇందోర్‌లో క్రియాశీల సభ్యురాలిగా పని చేశారు. లార్డ్స్ క్రికెట్ స్టేడియంలోని కామన్ రూమ్‌లో ప్రవేశించిన ఏకైక మహిళ ఆమె. సీసీఐ నుంచి సిల్వర్ కోటెడ్ బ్యాట్‌ను అందుకున్నారు. చంద్ర పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి" అని విజయ్ నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: వినూత్నంగా రాజస్థాన్ జట్టు జెర్సీ ఆవిష్కరణ
ఇదీ చదవండి: రనౌట్ కోసం డికాక్ ట్రిక్- మాజీల ఆగ్రహం