ETV Bharat / sports

ఐపీఎల్ నిరవధిక వాయిదా.. సీజన్ నిర్వహణ సందేహమే

author img

By

Published : Apr 15, 2020, 2:58 PM IST

ప్రముఖ క్రికెట్ లీగ్ ఐపీఎల్​ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుత సీజన్.. ఈ ఏడాదిలో జరుగుతుందా? లేదా? అనేది సందేహమే.

ఐపీఎల్ నిరవధిక వాయిదా.. ఈ సీజన్ నిర్వహణ సందేహమే
ఐపీఎల్

కరోనా మహ్మమారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధిక వాయిదా పడింది. ఈ విషయాన్ని తొలుత ఫ్రాంఛైజీలకు చెప్పిన బీసీసీఐ.. ఈరోజు(బుధవారం) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

షెడ్యూల్​ ప్రకారం ఐపీఎల్‌.. మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాలి. కానీ ప్రభుత్వ ఆంక్షల కారణంగా విదేశీ ఆటగాళ్లు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల టోర్నీని ఏప్రిల్‌ 15కు వాయిదా వేశారు. ఇప్పుడు లాక్​డాన్ మే 3వరకు పెరగడం వల్ల నిరవధిక వాయిదా వేయక తప్పలేదు.

Indian Premier League 2020
ఐపీఎల్ 2020

బీసీసీఐకి ఈ ఏడాది సెప్టెంబరు-నవంబరు మధ్యలో మాత్రమే ఐపీఎల్‌ను నిర్వహించే వీలుంది. అదీ టీ20 ప్రపంచకప్‌ను రీషెడ్యూలు చేయడానికి ఐసీసీ, ఆస్ట్రేలియా ఒప్పుకుంటేనే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.