విండీస్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు ఆటకు కాస్త విరామం దొరకగానే అక్కడ దీవుల్లో జలకాలాటలు ఆడారు. వెస్టిండీస్ క్రికెటర్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్‌తో కలిసి డైవింగ్ చేశారు. శ్రేయస్, శిఖర్ చేసిన బ్యాక్ ఫ్లిప్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు ఆటగాళ్లు.
" సహజసిద్ధమైన నీరు.. చుట్టూ పచ్చదనం.. స్వచ్ఛమైన గాలి... ఆహా..! ఎంత బావుంది" అని పోస్ట్ చేశాడు ధావన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"నాకు ఎగరడం రాదని.. ఇంకెవరూ అనలేరు. ఈ వీడియోనే ఇందుకు సాక్ష్యం" అని ఇన్‌స్టాలో అన్నాడు అయ్యర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది టీమిండియా. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. రెండో వన్డేలో నెగ్గిన భారత జట్టు 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. నేడు ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో మూడో వన్డే జరగనుంది.
ఇది చదవండి: డేవిస్ కప్: వేదిక మార్పా..? లేక వాయిదానా..?