ETV Bharat / sports

అందుకే ఆసీస్​పై గెలిచాం.. భారత క్రికెటర్ల వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే, టీ20 సిరీస్​లు పూర్తయిన నేపథ్యంలో పలువురు భారత ఆటగాళ్లు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది సమష్టి విజయమని అన్నారు. వన్డే సిరీస్ ఓటమి తర్వాత అద్భుతంగా పోరాడమని చెప్పారు.

Indian cricketers about winning T20 against Australia
'అందుకే ఆసీస్​పై గెలిచాం'
author img

By

Published : Dec 9, 2020, 5:40 PM IST

ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా పేలవంగా ఆరంభించినా, అనంతరం విజయాలతో హోరెత్తించి టీ20 సిరీస్‌ కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌ను 1-2తో చేజార్చకున్న భారత్.. పొట్టిఫార్మాట్ సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. అయితే మంగళవారంతో భారత్×ఆసీస్ వన్డే, టీ20ల సిరీస్‌లు పూర్తయ్యాయి. డిసెంబర్‌ 17 నుంచి టెస్టు సిరీస్‌కు మొదలు కానుంది. సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపిక కాని ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టు ప్రదర్శన గురించి ఆటగాళ్లు తమ అభిప్రాయాలు వెల్లడించారు.

"ఆస్ట్రేలియాలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన తర్వాత పోటీలో నిలవడం అంత సులువుకాదు. అయితే తొలి రెండు వన్డేల ఓటమి అనంతరం మేం నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌గా భావించాం. చివరి వన్డే, మూడు టీ20ల్లో విజయం సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగాం. వన్డే, టీ20 సిరీస్‌ల్లో మేం ఎంతో నేర్చుకున్నాం. ప్రతిమ్యాచ్‌ సవాలే. సహచరులపై విశ్వాసంతో జట్టుగా ముందుకు సాగాం. వ్యక్తిగతంగా, జట్టుగా మరింత మెరుగవుతామని ఆశిస్తున్నాను"

-కేఎల్ రాహుల్, భారత వికెట్ కీపర్ బ్యాట్స్​మన్

"మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్ అవార్డును నా కొడుకు అగస్త్యకు, కుటుంబానికి అంకితం ఇస్తున్నాను. వారంతా నాకు అండగా నిలిచారు. అయితే మాది కచ్చితంగా సమష్టి విజయం. వ్యక్తిగత ప్రదర్శనతో కాకుండా జట్టుగా సిరీస్‌ను గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో అందరూ సత్తాచాటారు. నటరాజన్‌ ప్రదర్శన ప్రత్యేకం. ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో శ్రమంచి జట్టులోకి వచ్చాడు. అతడి ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాడు. మనపై మనకు విశ్వాసం ఉంటే ఏదైనా సాధిస్తామనడానికి అతడే ఉదాహరణ"

- హార్దిక్‌ పాండ్య, ఆల్‌రౌండర్‌

"ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రాణించాలని భావించాను. మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. పేలవంగా పర్యటన ఆరంభించినా తిరిగి సత్తాచాటాడం గొప్ప విషయం"

- వాషింగ్టన్‌ సుందర్,స్పిన్నర్‌

"రెండు వన్డేల ఓటమి తర్వాత గొప్పగా పోరాడాం. ప్రతిఒక్కరూ మనసు పెట్టి ఆడుతూ, తిరిగి పోటీలోకి వచ్చిన తీరు అద్భుతం. ఐపీఎల్ తర్వాత అందరి ఆలోచన దృక్పథం గొప్పగా ఉంది. రెండున్నర నెలల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూ బయోబబుల్‌లోనే ఉండటం అన్నింటి కంటే కఠిన సవాలు అనిపించింది"

- సంజూ శాంసన్,వికెట్‌ కీపర్‌,బ్యాట్స్‌మన్‌

" వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా బాగా ఆడింది. టీ20ల్లో మేం గొప్పగా సత్తాచాటాం. జట్టులోని అందరూ చక్కని ప్రదర్శన కనబరిచారు. హార్దిక్‌, నటరాజన్ ప్రత్యేకం. కంగారూల గడ్డ నుంచి టీ20 సిరీస్‌ విజయంతో తిరిగి వెళ్లడం గర్వంగా ఉంది"

- మనీశ్‌ పాండే, బ్యాట్స్‌మన్‌.

ఆస్ట్రేలియా టీమ్​ఇండియా మధ్య తొలి టెస్టు అడిలైడ్​ వేదికగా డిసెంబర్ 17న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు సారథి మొదటి మ్యాచే ఆడనున్నాడు. పితృత్వ సెలవులపై స్వదేశానికి తిరిగి రానున్నాడు. అయితే చివరి రెండు టెస్టులకు రోహిత్​ శర్మ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:'బ్యాట్స్​మెన్ అలా చేస్తే.. కెప్టెన్​కు ఒత్తిడి తగ్గినట్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.