ETV Bharat / sports

దెబ్బకు దెబ్బ.. రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం - kl rahul-kohli

రాజ్​కోట్​లో జరిగిన రెండో వన్డేలో భారత్ గెలిచింది. ఆస్ట్రేలియాపై 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం 1-1తో సిరీస్​ సమమైంది. నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆదివారం బెంగళూరులో జరగనుంది.

team india won
ఆసీస్​పై భారత్​ విజయం
author img

By

Published : Jan 17, 2020, 9:32 PM IST

Updated : Jan 17, 2020, 9:48 PM IST

ఆస్ట్రేలియాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. తొలిమ్యాచ్​లో ఓటమికి బదులుగా రెండో వన్డేలో అద్భుత విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్‌ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. జట్టు మొత్తం సమష్టిగా రాణించి, ఆసీస్​పై 36 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాట్స్​మెన్ రాణిస్తే, ఆ తర్వాత బౌలర్లు కంగారూల పని పట్టారు.

virat kohli
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత్​కు.. ఓపెనర్లు శుభారంభమిచ్చారు. తొలి వికెట్​కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 42 పరుగులు చేసి రోహిత్ ఔటయ్యాడు. తర్వాత ధాటిగా ఆడిన ధావన్.. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని, సెంచరీకి చేరువయ్యాడు. అయితే 96 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జంపా బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

kl rahul
భారత బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్

కాసేపటికే అయ్యర్ ఔటవగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు కోహ్లీ-రాహుల్. వేగంగా ఆడే ప్రయత్నంలో జంపా బౌలింగ్​లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్​ చేరాడు విరాట్. చివర్లో రాహుల్ వీరవిహారం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడి, 80 పరుగులు చేశాడు. మొత్తంగా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది భారత్. ఆసీస్​ బౌలర్లలో జంపా 3, రిచర్డ్​సన్ 2 వికెట్లు తీశారు.

అనంతరం ఛేదన ప్రారంభించిన ఆసీస్.. నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. త్వరగానే వార్నర్(15) వికెట్ పోగుట్టుకుంది. తర్వాత కాసేపటికే ఫించ్ 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్-లబుషేన్ మూడో వికెట్​కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

australia
ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్

ఈ క్రమంలో స్మిత్(98), లబుషేన్(46) కొద్దిలో సెంచరీ, అర్ధ సెంచరీలు మిస్ చేసుకున్నారు. మిగతా వారిలో ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. టీమిండియా బౌలింగ్​లో షమి 3.. సైనీ, జడేజా, కుల్​దీప్ తలో 2 వికెట్లు పడగొడితే, బుమ్రా ఓ వికెట్ తీశాడు.

ఇవీ చదవండి:

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide, excluding USA, Canada, UK and Eire. All clients in Germany and Austria are required to provide 5 (five) second courtesy credit "Bilder von Sky Sports". Max use 90 seconds for all clients in New Zealand, Germany, Austria and France. Otherwise, max use 2 minutes. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Abu Dhabi Golf Club, Abu Dhabi, UAE. 17th January, 2020.
1. 00:00 Scenic
2. 00:03 Brooks Koepka - birdie at 7
3. 00:18 Thomas Pieters - second shot at 8
4. 00:46 Patrick Cantlay - tee shot at 12th
5. 01:09 Sergio Garcia - irdie at 12
6. 01:24 Rafa Cabrera Bello - birdie at 11
7. 01:47 Francesco Laporta - birdie at 18  
SOURCE: European Tour Productions
DURATION: 02:07
STORYLINE:
Francesco Laporta delivered a stunning round of 63 on Friday to take a one shot lead into the weekend at the 2020 Abu Dhabi HSBC Championship, while
World number one Brooks Koepka is seven shots back on three-under-par.
Last Updated : Jan 17, 2020, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.