టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ మరో మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో అలెక్స్ క్యారీ వికెట్ పడగొట్టిన ఈ స్పిన్నర్.. ఈ ఫార్మాట్లో 100 వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతి తక్కువ ఇన్నింగ్స్(58)ల్లో ఈ ఘనత సాధించిన భారత స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున మూడో వాడిగా నిలచాడు.
ఈ ఫీట్ అందుకున్న కుల్దీప్.. వన్డేలో 100 వికెట్ల క్లబ్‌లో చేరిన 22వ భారత బౌలర్‌గా, 8వ స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు. అఫ్గానిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. వన్డేల్లో 100 వికెట్లను వేగంగా తీసిన బౌలర్‌గా చరిత్ర లిఖించాడు. 44 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు.