ETV Bharat / sports

భారత మహిళల జట్టు.. ఆరేళ్ల తర్వాత తొలి టెస్టు - అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఆరేళ్ల తర్వాత.. త్వరలో భారత మహిళల జట్టు ఓ టెస్టు మ్యాచ్​ ఆడనుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు.

India women's team to play one-off Test against England
ఆరేళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్​ ఆడనున్న మహిళలు
author img

By

Published : Mar 8, 2021, 9:03 PM IST

దాదాపు ఆరేళ్ల తర్వాత భారత మహిళల జట్టు ఓ టెస్టు మ్యాచ్​ ఆడనుంది. ఇంగ్లాండ్​ జట్టుతో ఈ ఏడాదిలోనే ఆ మ్యాచ్​ జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం ప్రకటించారు.

"అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా భారత మహిళల జట్టు.. మరోసారి టెస్టులు ఆడనుందని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. ఈ ఏడాదిలో ఇంగ్లాండ్​తో ఒక టెస్టు మ్యాచ్​లో తలపడనుంది. బ్లూ జెర్సీలో ఉన్నవారు తెలుపు జెర్సీలోకి మారనున్నారు."

-జై షా, బీసీసీఐ కార్యదర్శి

అయితే వేదిక ఎక్కడనేది షా వెల్లడించలేదు. ఇంగ్లాండ్​ పర్యటనలో జూన్​ లేదా జులైలో ఈ మ్యాచ్​ జరుగుతుందని తెలుస్తోంది.

చివరిసారిగా 2014లో మైసూర్​లో సౌతాఫ్రికాతో మిథాలీ సేన టెస్టు మ్యాచ్​ ఆడింది.

దాదాపు ఏడాది తర్వాత ప్రస్తుతం సఫారీ జట్టుతోనే లఖ్​నవూలో వన్డే సిరీస్​ ఆడుతోంది టీమ్​ఇండియా.

ఇదీ చూడండి: రెండో వన్డేలో మిథాలీ సేన సత్తా చాటేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.