ETV Bharat / sports

అందులో గెలవాలి లేదంటే భారత్​కు వైట్​వాషే: క్లార్క్ - మైఖేల్​ క్లార్​ విరాట్​ కోహ్లీ

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ సరిగా ఆడకపోతే టెస్టు సిరీస్​లో వైట్​వాష్ తప్పదని అన్నాడు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. అయితే బుమ్రా, కోహ్లీ.. ఆసీస్ ఆటగాళ్లపై విరుచుకుపడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు.

India will get smoked 4-0 in Tests if Kohli does not set tone before leaving, says Clarke
'కోహ్లీసేన అందులో ఓడితే టెస్టు సిరీస్​నూ కోల్పోతుంది'
author img

By

Published : Nov 24, 2020, 1:18 PM IST

ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్​లో టీమ్​ఇండియా ఓడిపోతే.. టెస్టు సిరీస్​లో వైట్​వాష్​ అవుతుందని​ ఆసీస్​ మాజీ కెప్టెన్​ మైకేల్ క్లార్క్​ అభిప్రాయపడ్డాడు. కోహ్లీసేన బాగా ఆడితేనే పైచేయి సాధిస్తుందని అన్నాడు.

"ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్​లో టీమ్​ఇండియా గెలవాలి. లేదంటే టెస్టు సిరీస్​నూ 4-0 తేడాతో వైట్​వాష్ అవుతుందని అనుకుంటున్నాను. వన్డేలు, టీ20ల్లో బాగా ఆడితే మాత్రం తొలి టెస్టులో కెప్టెన్ కోహ్లీ కీలకపాత్ర పోషించే అవకాశముంది. బుమ్రా లాంటి అత్యుత్తమ బౌలర్​తో ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. బుమ్రాతో పాటు కెప్టెన్​​ కోహ్లీ, ఆస్ట్రేలియాపై విరుచుకుపడే ప్రమాదం ఉంది"

- మైకేల్​ క్లార్క్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

2018-19లో జరిగిన బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై టీమ్ఇండియా అద్భుత విజయం సాధించింది. కంగారూ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్​ను కైవసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. నవంబరు 17 నుంచి జనవరి 19వరకు జరిగే ఈ పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.