భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ... మరో రికార్డుకు పాతిక పరుగుల దూరంలో ఉన్నాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఇందులో తన టీ20 కెరీర్లోనే అత్యధికంగా 94 పరుగులు చేశాడు కోహ్లీ. స్వదేశంలో నిర్వహించిన టీ20ల్లో ఇప్పటి వరకు విరాట్ 975 పరుగులు చేశాడు. ఈరోజు సాయత్రం జరగనున్న రెండో టీ20లో వెస్టిండీస్‌తో భారత్ మరోసారి తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే.. స్వదేశంలో 1000 పరుగులు తీసిన తొలి భారత్ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
ఇప్పటివరకు న్యూజిలాండ్ ఆటగాళ్లు మార్టిన్ గప్తిల్ 1430 పరుగులు, కొలిన్ మున్రో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. కోహ్లీ కూడా వేయి రన్స్ చేస్తే... ఈ జాబితాలో మూడో స్థానం కైవసం చేసుకుంటాడు.
రోహిత్‌కు 3 అడుగుల దూరంలో...
భారత టాప్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రికార్డునూ బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు కోహ్లీ. నేటి మ్యాచ్‌లో విరాట్ మరో మూడు పరుగులు చేస్తే.. టీ20ల్లో అత్యుత్తమ స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలుస్తాడు. ఇప్పటికే ఈ రికార్డు వీరిద్దరి మధ్య దోబూచులాడుతోంది.
ప్రస్తుతం రోహిత్ శర్మ ఆడిన ఈ పొట్టి ఫార్మాట్లో... 2,547 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ ఈ స్కోరును అధిగమిస్తే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందనున్నాడు.
ఇదీ చూడండి: సిరీస్ విజయంపై కోహ్లీసేన దృష్టి.. ప్రతీకారంతో విండీస్