వెస్టిండీస్‌పై పదో ద్వైపాక్షిక సిరీస్ గెలుపే లక్ష్యంగా టీమిండియా నేడు నిర్ణయాత్మక మూడో వన్డేలో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే కరీబియన్ జట్టుపై వరుసగా తొమ్మిది సిరీస్‌లు గెలుపొందింది భారత్. కటక్ వేదికగా జరగనున్న మూడో వన్డేలోనూ విజయం సాధించి రికార్డు సృష్టించాలని పట్టుదలగా ఉంది.
టాపార్డర్ భారత్ బలం...
విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓపెనర్లు అదరగొట్టేశారు. రోహిత్ శర్మ(159), రాహుల్(102) జోడీ సెంచరీలతో చెలరేగింది. తర్వాత రిషభ్ పంత్(39), శ్రేయస్ అయ్యర్(53) ధాటిగా ఆడి సాగర తీరంలో సిక్సర్ల మోత మోగించారు. ఒక్క కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ మినహాయిస్తే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అత్యద్భుతమనే చెప్పాలి.
-
📸📸
— BCCI (@BCCI) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Snapshots from #TeamIndia's training session ahead of the 3rd and final ODI against West Indies.
Who will take the 🏆 home?#INDvWI pic.twitter.com/CCkPrpR5Gw
">📸📸
— BCCI (@BCCI) December 21, 2019
Snapshots from #TeamIndia's training session ahead of the 3rd and final ODI against West Indies.
Who will take the 🏆 home?#INDvWI pic.twitter.com/CCkPrpR5Gw📸📸
— BCCI (@BCCI) December 21, 2019
Snapshots from #TeamIndia's training session ahead of the 3rd and final ODI against West Indies.
Who will take the 🏆 home?#INDvWI pic.twitter.com/CCkPrpR5Gw
బౌలింగ్‌తోనే సమస్య...
388 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్‌ను నిలువరించడంలో భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఒకానొక సమయంలో వికెట్లు పడగొట్టలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే ఒక్కసారి షమి వికెట్లు తీయడం ప్రారంభమయ్యాక కోలుకున్నారు పేసర్లు. కుల్‌దీప్ హ్యాట్రిక్‌తో మ్యాచ్ గమనం మారిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 107 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా.. బౌలింగ్ విషయంలో ఇంకా లోటుపాట్లు ఉన్నాయి. ప్రధాన పేసర్ భువనేశ్వర్ గాయంతో తప్పుకోవడం వల్ల జట్టులోకి వచ్చిన శార్దుల్.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. జడేజా తన స్పిన్ బౌలింగ్‌తో కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. మూడో వన్డేకు ముందు పేసర్ దీపక్ చాహర్ వెన్నునొప్పి కారణంగా తప్పుకోగా, అతడి స్థానంలో నవ్‌దీప్ సైనీ వచ్చాడు.
-
UPDATE: Deepak Chahar has been ruled out of the 3rd @Paytm #INDvWI ODI. Navdeep Saini replaces him.
— BCCI (@BCCI) December 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Details - https://t.co/7vL5GJobTU pic.twitter.com/QbHQL1KMyY
">UPDATE: Deepak Chahar has been ruled out of the 3rd @Paytm #INDvWI ODI. Navdeep Saini replaces him.
— BCCI (@BCCI) December 19, 2019
Details - https://t.co/7vL5GJobTU pic.twitter.com/QbHQL1KMyYUPDATE: Deepak Chahar has been ruled out of the 3rd @Paytm #INDvWI ODI. Navdeep Saini replaces him.
— BCCI (@BCCI) December 19, 2019
Details - https://t.co/7vL5GJobTU pic.twitter.com/QbHQL1KMyY
విండీస్ టాప్ సూపర్...
భారత్‌కు తగ్గట్టుగానే విండీస్ బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. హెట్‌మెయర్, షై హోప్ తొలి వన్డేలో చెలరేగారు. ఇద్దరూ శతకాలతో రాణించడం వల్ల చెపాక్‌లో కరీబియన్ జట్టు విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో హోప్(78) ఆకట్టుకున్నా అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్ కరవయ్యారు. మధ్యలో నికోలస్ పూరన్(75) ధాటిగా ఆడినా తుదివరకు నిలవలేకపోయాడు. ఒకవేళ కీమో పాల్, పొలార్డ్, ఛేజ్ రాణించి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.
-
Great training session for our West Indies team in Cuttack today. All set for tomorrow’s big ODI against @BCCI
— Windies Cricket (@windiescricket) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Series level 1-1 so it’s now winner-takes-all in our final contest for the year and this decade#MenInMaroon #INDvWI pic.twitter.com/ZFAikv1PEi
">Great training session for our West Indies team in Cuttack today. All set for tomorrow’s big ODI against @BCCI
— Windies Cricket (@windiescricket) December 21, 2019
Series level 1-1 so it’s now winner-takes-all in our final contest for the year and this decade#MenInMaroon #INDvWI pic.twitter.com/ZFAikv1PEiGreat training session for our West Indies team in Cuttack today. All set for tomorrow’s big ODI against @BCCI
— Windies Cricket (@windiescricket) December 21, 2019
Series level 1-1 so it’s now winner-takes-all in our final contest for the year and this decade#MenInMaroon #INDvWI pic.twitter.com/ZFAikv1PEi
బౌలింగ్‌లో జోరు పెంచాలి...
వెస్టిండీస్ బౌలింగ్ విభాగంలో షెల్డన్ కాట్రెల్, అల్జారీ జోసెఫ్, హోల్డర్ కట్టుదిట్టంగా బంతులేసినా పరుగులను నియంత్రించలేకపోయారు. చివరి మ్యాచ్‌లో విండీస్ ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశముంది. వాల్ష్ స్థానంలో కేరీ పెర్రీ రానున్నాడు.
టాస్ కీలకం..
తొలి రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన విండీస్.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే.. మూడో వన్డేలో పరిస్థితి మారే అవకాశం ఉంది. కటక్ మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలిచినా మంచు ప్రభావం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపుతారు. ఎందుకంటే ఈ పిచ్ విశాఖ మాదిరిగానే పరుగుల వరద పారిస్తుందని సమాచారం. ఫలితంగా టాస్ కూడా కీలకంగా మారనుంది.
ఇరుజట్లు అంచనా...
భారత్:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకుర్, నవదీప్ సైనీ.
వెస్టిండీస్:
షై హోప్(కీపర్), ఎవిన్ లూయిస్, షిమ్రన్ హెట్మెయిర్, నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, షెల్డన్ కాట్రెల్,కేరీ పెర్రీ.